పాకిస్థాన్ లో ఉరి శిక్ష పడ్డ తన భర్త కులభూషణ్ యాదవ్ ను కలవడానికి సోమవారం పాకిస్థాన్‌కు వెళ్లిన అతని భార్య, తల్లి పట్ల ఆ దేశ అధికారులు అత్యంత హేయంగా అమానుషంగా కర్కశంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులను పాకిస్థాన్ అధికారులు వేధించారు. దౌత్య నిబంధనలను పచ్చిగా ఉల్లంఘించారు. వాళ్ళు ఆ కుటుంబంపై చేపట్టిన జరిపిన అమనవీయ చర్యలు. 

jadav

-భార్యతో మెడలో మంగళ సూత్రం తీసేయించారు. 
-భార్య నుదుట బొట్టును చెరిపేయించారు. 
-కొడుకుతో మాతృభాషలో మాట్లాడేందుకు ప్రయత్నించిన తల్లిని అడ్డుకొన్నారు. 
-వేషం మార్చుకొమ్మన్నారు. 
-చెప్పులు వదిలేసి వెళ్లమన్నారు. 
-మాటల మధ్యలో అడుగడుగునా అడ్డంకులు


కులభూషన్ జాదవ్‌తో కుటుంబసభ్యుల సమావేశానికి భారత్ పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తరువాత, దౌత్యపరమైన షరతులను ఇరుదేశాలు అంగీకరించిన తర్వాత ఆయన తల్లి భార్య ఆయన్ను కలిసిన సమయంలో వారికి ఆ తృప్తిని కూడా మిగల్చకుండా పాకిస్థాన్ కనీస దౌత్య నిభందనల్లోని ఒక్క నిభందనని ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు.

Image result for kulbhushan jadhav mother & wife sufferings in pak and media

మానవతా దృక్పథంతో ఆదేశ "జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా" పవిత్ర జయంతి రోజున కులభూషన్ జాదవ్‌ను అతని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి స్తున్నాం అంటూ గొప్పగా ప్రచారం చేసుకొన్న పాకిస్థాన్ విదేశాంగ శాఖ, వృద్ధురాలైన జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన్‌ పట్ల అత్యంత హేయంగా వ్యవహరించింది. వీరి వెంట పాకిస్థాన్‌కు వెళ్లిన డిప్యూటీ హైకమిషనర్‌ను లోపలికి పంపించినప్పటికీ, ఆయన్ను జాదవ్‌తో మాట్లాడనివ్వలేదు. 

Image result for kulbhushan jadhav mother & wife sufferings in pak and media

కులభూషణ్ జాదవ్‌ను కలిసే అవకాశం కలిపించడం ద్వారా తాము ఎంతో ఔదార్యాన్ని చూపించామంటూ, ట్విట్టర్ ద్వారా, మీడియా ద్వారా పదే పదే అనేక ఫొటోలు షేర్ చేసిన పాకిస్థాన్ ప్రభుత్వ అసలు స్వరూపం బయటపడింది. జాదవ్ కుటుంబ సభ్యులు పాకిస్థాన్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఒకరకమైన భయానక వాతావరణాన్ని అధికారులు కల్పించారు. 

Image result for pak india kulbhushan

ఇక పాక్ మీడియా అధికారున ప్రోద్భలంతో రెచ్చిపోయింది. నోటి కొచ్చిన కారు కూతలు కూసింది. 22 ఏళ్ల పాటు పాక్ అక్రమ నిర్బంధంలో ఉన్న కన్నకొడుకును,కట్టుకున్న భర్తను చూసుకునేందుకు ఎంతో ఆతృతగా ఇస్లామాబాద్ వెళ్లిన కులభూషణ్ జాదవ్ తల్లి, భార్యకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యారు. పాక్ అధికారుల సాక్షిగా అక్కడ మీడియా జాదవ్ కుటుంబ సభ్యులపై తమ ప్రతాపం చూపింది. అసలే ఆవేదనలో మ్రగ్గిపోతున్న తల్లి భార్యను మాటలతో చేతలతో హింసించారు పాక్ అధికారులు. అనుక్షణం ఒప్పంద నియమాలను ఉల్లంగిస్తూ, పాక్ మీడియాను అనుమతించరాదన్న నిబంధనను సైతం పాక్ అధికారులు తుంగలోకి తొక్కారు.

Image result for kulbhushan mother avanti wife chetan kul

దొడ్డిదారిన అనుమతింన, పాక్ మీడియా - జాదవ్‌ ను కలుసుకుని బయటకు వచ్చిన ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్‌ కుల్ జాదవ్‌ లపై పాక్ మీడియా విరచుకు పడింది. తిరిగి వాళ్ళిద్దరూ కారు వద్దకు చేరే లోపే మీడియా చుట్టు ముట్టి అనకూడని రావకూడని మాటలతో వారిని విపరీత మానసిక క్షోభకు, అవమానానికి గురిచేసింది. అవంతి జాదవ్‌‍ ను "హంతకుడి తల్లి" అని సంబోధిస్తూ, నీ హంతక తనయుడిని చూసిన తర్వాత నీకేలా అనిపించింది? అంటూ ప్రశ్నలతో వేదించారు. ఇంకా అనేక ప్రశ్న లతో జర్నలిస్టు అవంతి జాదవ్‌ను కార్నర్‌ చేశారు. హంతక తనయుణ్ణి చూసేందుకు పెద్ద మనసుతో అన్గీకరించిన పాకిస్థాన్ దయార్ధ ప్రభుత్వానికి కృతఙ్జతలు చెబుతారా? లేదా? అంటూ మరొకరు నిలదీశారు.

 Image result for kulbhushan mother avanti wife chetan kul
చివరకు భర్తను ఆ స్థితిలో చూసి అచేతన అయిన చేతన్ కుల్ జాదవ్‌ న కూడా పాక్ మీడియా విడిచిపెట్టలేదు."నీ భర్త వేలాది మంది అమాయకులైన పాకిస్థానీయులను ఊతకోత కోశాడు. దీనికి ఏమి సమాధానం చెబుతావు?" అని ఒక జర్నలిస్టు చేతన్‌ కుల్ జాదవ్‌ పై తన కర్కశ గరళ విద్వేషం కక్కాడు. అప్పుడు అక్కడ చాలా సేపు కుల భూషణ్ జాదవ్ కుటుంబీకులు నిస్సహా యంగా నిరుత్తరంగా ఉన్నచోటే ఉండిపోయారు.  పాకిస్థాన్ మీడియా దుశ్చర్యలతో కూడిన దుందుడుకుతనం దూకుడుపై బయటకు వచ్చిన వీడియోలపై ఇప్పటికే  భారత్‌ జనావళి నుండి ఆగ్రహావేశాలు పెల్లుభుకుతున్నాయి. పాక్ మీడియా తీరు పై భారత్ తీవ్ర ఆగ్రహం వక్తం చేయగా, ఇదే అంశాన్ని పార్లమెంటులో విపక్షాలు లెవనెత్తి పాక్ దుర్నీతిని ఎండ గట్టాయి. 

Image result for kulbhushan mother avanti wife chetan kul

మరింత సమాచారం తెలుసుకోండి: