దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినతే లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో అతడికి జనవరి 3 న శిక్ష ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాంచీలోని హాత్వార్ జైల్లో వీఐపీ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.  అయితే ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న లాలూకి  హాత్వార్ జైల్లో సకల భోగాలు అనుభవిస్తున్ననట్లు సమాచారం.  ఈ విషయాన్ని జార్ఖండ్ కేంద్రంగా వెలువడు 'ప్రభాత ఖబర్' పత్రిక సంచలన కథనం ప్రచురించింది.

తానుండే జైళ్లోని పై అంతస్తులో ఖాళీ సమయాన్ని ఖైదీలుగా ఉన్న రాజకీయ నేతలతో కలసి చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనకు అవసరమైన తినుబండారాలు, కాఫీలు, పానీయాలు వేళకు సమకూరుతున్నాయని తెలిపింది.దినపత్రిక చదవడంతో ఆయన దినచర్య ప్రారంభిస్తారని, పత్రికల్లో వార్తలపై జైళ్లోని ఖైదీలుగా ఉన్న నేతలతో సమగ్రంగా చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.

1991 నుంచి 1994 మధ్య కాలంలో దియోగఢ్ ఖజానా నుంచి రూ.89.29 లక్షలు అక్రమంగా ఉపసంహరించినట్లు నేరం రుజువు కావడంతో లాలూను దోషిగా తేల్చింది. జనవరి 3 న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు.దాణా కుంభకోణంలో లాలూతోపాటు మరో 15 మందిని సీబీఐ న్యాయస్థానం గత శనివారం దోషిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: