తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ ఎంత కష్టపడ్డారో గానీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం ఆ కష్టం ఫలాలను సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఆయనకు ఎదురే లేదు మరి. గట్టిగా నిలదీసే ప్రతిపక్షం లేదు. పార్టీలో అసమ్మతి వంటి అవకాశాలే లేవు. గట్టిగా నిలదీసే నాయకులే లేరు. అటు జనంలోనూ తెలంగాణ తెచ్చిన నాయకుడిగా పేరుంది. 



ఇక పరిపాలన విషయానికి వస్తే.. చేతినిండా ఖర్చు చేసేంత బడ్జెట్ ఉంది. హైదరాబాద్ పుణ్యమా అని తెలంగాణ ధనిక రాష్ట్రం కూడా. అందుకే ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుంది. బహుశా దేశంలో ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ అంత సుఖంగా సీఎం కుర్చీలో కూర్చొని ఉండకపోవచ్చు. కేసీఆర్ అధికారంలోకి రాగానే.. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 

telangana new districts కోసం చిత్ర ఫలితం

ఉన్న పది జిల్లాలను మొదట్లో పాతిక చేద్దామనుకున్నా.. డిమాండ్లన్నీ ఓకే చెప్పడంతో ఈ జాబితా 31కు చేరింది. ఇంకా ఒకటి రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయి. అయితే ఇప్పుడు  టిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను తగ్గించాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. అసలు 31 జిల్లాల అవసరం ఉందా అని ఇప్పుడు తీరిగ్గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా  వరంగల్‌ రూరల్‌ జిల్లాను ఎత్తివేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. 

telangana new districts కోసం చిత్ర ఫలితం

ఈ జిల్లాతో పాటు జనగాం, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి వంటి చిన్న జిల్లాలను కొనసాగించాలా..? వద్దా అని తెలంగాణ సర్కారు పునరాలోచనలో పడిందట. వీటిలో కొన్నింటిని ఎత్తివేడం ఖాయం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగా కేసీఆర్ ఫీలర్ వదిలినట్టు తెలుస్తోంది. జనం నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోతే వాటిని ఎత్తేయడం ఖాయం కావచ్చు. మరీ అంత చిన్న జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేసినట్టు.. మళ్లీ ఎందుకు ఎత్తేస్తున్నట్టు.. ఇదంతా చూస్తే తుగ్గక్ గుర్తొస్తే అది మీ తప్పు కాదు సుమా. 



మరింత సమాచారం తెలుసుకోండి: