చైనా చరిత్ర గాని ఆధునిక చైనా వ్యవహారాలుగాని ఒక విధంగా మిగతా దేశాలకు అంతుపట్టవు. పంచశీలపై సంతకం చేశారు వెంటనే మనదేశం పై దాడి చేశారు. అలాగే అటు శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు దాన్ని ముంచేశారు. ఇలా చూస్తే ఇరుగుపొరుగులతో దాని సంభందాలన్నీ పారదర్శకం కావు. దానికేం కావాలో అదే చేసు కుపోతుంది. ఇందులోనూ నంగి నంగి గా వ్యవహారాలు నిర్వహిస్తుంది. ఒక నాగరిక అంతర్జాతీయ సమాజంలో ఎలా మెలగకూడదో అలాగేచేస్తుంది. 135కోట్ల జన సామాన్యాని కి భాధ్యత వహిస్తున్న దేశంలాగా కనిపించదు. ఎవరో ఒకరి ఎస్టేట్ నిర్వహిస్తున్నట్లు ఉంటుంది. 

Image result for china and US difference about north korea

ఉత్తర కొరియా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన తర్వాత, దానిని భేఖాతర్ చేస్తూ, ఆ దేశానికి చైనా చమురు సరఫరా చేస్తోందని వార్తలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు.  ఉత్తరకొరియాకు చైనా చమురు పంపడం విచారకరం. ఇదిలాగే కొనసాగితే ఉత్తరకొరియా సమస్యకు సాను కూల పరిష్కారం దొరకదు అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Image result for china and US difference about north korea

వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తూ, అణ్వాయుధాలు పోగేస్తూ ప్రపంచదేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు అమెరికా గత సెప్టెంబర్‌లో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. సముద్ర మార్గం ద్వారా ఉత్తర కొరియా చమురు దిగుమతులు చేసుకోకుండా ఆంక్షలు విధిస్తూ చేసిన ఈ తీర్మానానికి ఐరాస ఆమోదం తెలిపింది.

Image result for china and US difference about north korea

ఆ తర్వాత మళ్ళీ ఉత్తర కొరియా ఇంకో అతి శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగిం చింది. దీంతో ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు కోరుతూ అమెరికా ఇంకొక తీర్మానం తేగా దానికీ ఐరాస ఆమోదం తెలిపింది. కాగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా ఉత్తరకొరియాకు సాయం చేస్తోందని వార్తలు వచ్చాయి. చైనా సాక్ష్యాధారాలతో దొరికి పోయిందంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
Image result for china and US difference about north korea

గత అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకూ ఉత్తర కొరియాకు చైనా 30 సార్లు చమురు సరఫరా చేసిందని దక్షిణకొరియా తెలిపింది. సముద్ర మార్గం లో చైనా ఓడలు ఉత్తరకొరియా ఓడలకు చమురు సరఫరా చేయడాన్నితమ శాటిలైట్లు గుర్తించాయని అమెరికా తెలిపింది. అయితే చైనా మాత్రం ఇంకా బుకాయిస్తోంది. ఉత్తర కొరియాపై వాణిజ్య ఆంక్షల ను చైనా కఠినంగా అనుసరిస్తోందని చైనా విదేశాంగశాఖ పేర్కొంది.

China and Russia have both called on Donald Trump and Kim Jong-un

ఉత్తర కొరియా నిరంతర అణ్వాయుధ, క్షిపణి పరీక్షలతో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, కిమ్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్టవేయాలని అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.


ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితికి విన్నవించింది. దీంతో ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది. ఐరాసలో సభ్యులుగా ఉన్న దేశాలు ఉత్తర కొరియాతో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించరాదని ఆంక్షలు విధిస్తూ తీసు కొచ్చిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపింది.

Image result for china and US difference about north korea

అయితే ఈ నిబంధనలను చైనా ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియాకు చమురు ఎగుమతి చేస్తోందనే నిబద్దమైన సమాచారం బయట కు వచ్చినట్లు అమెరికా చెపుతుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు అమెరికా సంయమనం పాటించింది.

Image result for china and US difference about north korea

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం లో చైనా అడ్డంగా దొరికిపోయిందంటూ మండిపడ్డారు. ‘ఈ విషయంలో చైనా కపటవైఖరి బయట పడిందని, ఉత్తర కొరియాకు చైనా చమురు నిల్వలను ఎగుమతి చేయడం విచారకరం. ఇదిలాగే కొనసాగితే, ఉత్తర కొరియా సమస్యకు సానుకూల పరిష్కారం దొరకదని’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

Image result for china and US difference about north korea

గత ఏడాది నుంచి అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత లు చోటుచేసుకున్నాయి. దీంతో ఏం జరుగు తుందోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. ముఖ్యంగా వరుస అణు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ రెచ్చగొడుతున్న ఉత్తర కొరియా ఆగడాలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా గత సెప్టెంబర్‌ లో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. సముద్ర మార్గం ద్వారా ఉత్తరకొరియా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ తీసు కొచ్చిన తీర్మానానికి ఐరాస ఆమోదం తెలిపింది.

Image result for USA South Korea Japan Vs China North Korea Russia

ఐరాస ఆంక్షలు సైతం ధిక్కరిస్తూ ఉత్తర కొరియా అతి శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను పరీక్షిస్తోంది. ఐరాస నిబంధన లను ఉల్లంఘిస్తూ ఉత్తర కొరియాకు చైనా సాయం చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. గత అక్టోబరు నుంచి ఇప్పటి వరకు చైనా 30 సార్లు చమురు ఎగుమతి చేసిందని దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు.

Image result for USA South Korea Japan Vs China North Korea Russia

సముద్ర మార్గంలో చైనా ఓడలు ఉత్తర కొరియా ఓడల్లో చమురు నింపడాన్ని అమెరికా శాటిలైట్లు గుర్తించాయని వారు పేర్కొ న్నారు. అమెరికా వార్తాసంస్థలు దీనిపై కథనాన్ని ప్రచురించాయి. అయితే తమ కేమీ తెలియదని డ్రాగన్ బుకాయిస్తోంది. అంతేకాదు ఉత్తర కొరియాపై వాణిజ్య ఆంక్షలను తాము ఉల్లంఘించడం లేదని, కఠినంగా అమలు చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చైనా వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image result for USA South Korea Japan Vs China North Korea Russia

 చైనా ప్రక్కదేశాల భూబాగాల నాక్రమించతానికి ప్రయోగించే "సలాం స్లైసింగ్" అంటే నంగి నంగిగా ఉంటూ అమాయకత్వంతో కనిపిస్తూ లోపల మరో కుయుక్తులతో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తూ ఒక వైపు శత్రువులను మరోవైపు మిత్రులను సంశయాత్మక స్థితిలోకి తోసేసి తన పబ్బం గడుపుకుంటూ మెలమెల్లగా చెదలు పట్టినట్లు వ్యవస్థలను పాడుచేస్తూ తక్కువ ఖర్చుతో తన ప్రయోజనాలను కాపాడుకోవటం దాని సహజగుణం. పంచతంత్రంలోని జిత్తులమారి నక్క తత్వం. బాహ్యంగా "డ్రాగన్" లాగా కనిపిస్తూ. అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా చైనా పై దృష్టి పెట్టటం చాలా అవసరం. 

Image result for china north korea political cartoon

మరింత సమాచారం తెలుసుకోండి: