బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు నేడు రాజ్య సభకు రానుంది.  అయితే ట్రిపుల్ తలాక్ బిల్లుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు సహా విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ప్రాథమిక హక్కులను ట్రిపుల్ తలాక్ బిల్లు హరిస్తోందని, బిల్లులో న్యాయబద్ధత లోపించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే.   ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
Image result for ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
మూడుసార్లు వెంటవెంటనే తలాక్ చెప్పి భార్య నుంచి విడాకులుపొందే సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ కేంద్రప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఎవరైనా ట్రిపుల్ తలాక్‌కు పాల్పడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ తక్కువగా ఉండటం కూడా విపక్షాలకు కలిసొచ్చే అంశం.
Image result for ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
లోక్‌సభలో తమకు తగిన బలం లేకపోవడంతో బిల్లుపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం మినహా, ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ సభ్యులు.. రాజ్యసభలో బలం ఉండడంతో అడ్డుకోవాలని చూస్తుండగా, అధిష్ఠానం మాత్రం సందిగ్ధావస్థలో ఉంది. ఒక వేళ ట్రిబుల్ తలాక్ బిల్లు అడ్డుకుంటే అన్యాయంగా ముస్లిం మహిళల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉండడం, అలాగని అంగీకరిస్తే కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదన్న అపప్రధ మూటగట్టుకునే ప్రమాదం పొంచి ఉండడంతో ఏం చేయాలో దిక్కు తోచని  స్థితిలో పడిపోయింది.
Image result for ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
అంటే బిల్లును అంగీకరించినా, అడ్డుకున్నా నష్టపోయేది కాంగ్రెస్సే కాబట్టి ఈ వ్యవహారంలో అచీ తూచీ అడుగులు వేస్తుంది.  కాకాపోతే..బిల్లును వ్యతిరేకించకుండానే సవరణలకు పట్టుబట్టడం ద్వారా బిల్లును ఆలస్యం చేయాలని వ్యూహాన్ని రచిస్తోంది. ప్రభుత్వం ఎలాగూ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు ఇష్టపడకపోవడంతో లోపాలు ఎత్తిచూపాలని యోచిస్తోంది.
Image result for ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు
ఇక మరోవైపు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టిన బీజేపీ ధీమాగా ఉంది. రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం ఖాయమని మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఎన్డీయే బలం 80కి మించి లేదని, టీడీపీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా తమకే మద్దతు ఇస్తాయి కాబట్టి బిల్లు చట్టంగా మారడం పక్కా అని బీజేపీ నేతలు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: