గలీజ్ శ్రీనివాస్ గా ఇటీవల తన వికృత వీడియోలతో పేరు సంపాదించుకున్న గజల్ శ్రీనివాస్ అంశంలో ఎట్టకేలకు ఏపీ సర్కారు స్పందించింది. ఆయన్ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లైంగిక ఆరోపణలపై అరెస్టై జైల్లో ఉన్న ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది.

article data

ఈమేరకు పురపాలక శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2017 మే 28 తేదీన గజల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రభుత్వం నియమించింది. గజల్ శ్రీనివాస్ ఎన్నో దేశభక్తి గీతాలు రచించి పాడాడు.. గాంధీ తత్వాన్ని ప్రచారం చేశాడు.. అమ్మ గొప్పదనాన్ని కమ్మగా వర్ణించాడు. నీ బడిపిలుస్తోంది అంటూ ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం వచ్చేలా చేశాడు. 


గలీజ్ శ్రీనివాస్ తో బాబుకు తలవంపులు.. ఎందుకంటే..?

ఇన్ని సుగుణాలున్న గజల్ శ్రీనివాస్ వంటి వారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటే అది ఏపీ రాష్ట్రానికి ప్రమోషన్ అవుతందని చంద్రబాబు సర్కారు ఆశించింది. కానీ 
ఇప్పుడు అందుకు విరుద్దంగా జరిగింది. ఎంతో టాలెంట్ ఉన్న గజల్ శ్రీనివాస్.. కేవలం కామాన్ని జయించలేక.. కామాంధకారంతో విశృంఖలత్వంతో ఒక్కసారిగా గలీజ్ శ్రీనివాస్ గా మారిపోయాడు. ఆయన వేధింపులు తాళలేని ఓ యువత సాహసం చేసి గజల్ శ్రీనివాస్ వికృత స్వభావాన్ని బయటపెట్టేసింది. 


గలీజ్ శ్రీనివాస్ తో బాబుకు తలవంపులు.. ఎందుకంటే..?
దీంతో.. గజల్ శ్రీనివాస్ పై వ్యతిరేకత పెరిగిపోయింది. ఏపీ సర్కారుకు కూడా తలవంపులు తెచ్చిపెట్టింది. గజల్ శ్రీనివాస్ రాసలీలల వీడియోలు బయటకు వచ్చి నాలుగైదు రోజులవుతున్నా ఏపీ సర్కారు చర్య తీసుకోకపోడవంతో మహిళాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్ లాంటి వ్య్వక్తిని తక్షణమే ప్రభుత్వం స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుండి తొలగించాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగానైనా ఏపీ సర్కారు చర్య తీసుకుంది. అతన్ని బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: