తెలుగు భాషను బతికించుకోవాలి.. ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితి కొడిగట్టిన దీపంలా ఉంది. ఇంగ్లీష్ విద్య కారణంగా తర్వాత తరాలకు తెలుగు తెలియకుండా పోతోంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చేశాయి. మరికొన్ని రోజులు పోతే.. అసలు తెలుగులో చదువుకునే వారే కనిపించకపోవచ్చు.. అంటే మరికొన్నేళ్లలో తెలుగు రాయడం వచ్చిన పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తారన్నమాట.

Image result for chandrababu

మరి ఈ తెలుగు బాష కోసం ఏంచేయాలి... ప్రముఖ సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ను ఓ ప్రముఖ పాత్రికేయుడు ఇంటర్వ్యూలో అడిగారు. రెండు తెలుగు రాష్ట్రాలూ తెలుగు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అడిగారు. అందుకు యార్లగడ్డ దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కోసం ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నా.. వాటి ఫలితాలు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. 

Image result for kcr

ఇదే సమయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబబు రెండు ఛండాలపు పనులు చేశారని హాట్ కామెంట్స్ చేసారు. అవేమిటంటే... దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నదీ పుష్కరాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయరు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే 13 రోజులపాటు కూర్చుని పుష్కరాల పనులు పర్యవేక్షించరు.. పుష్కరాలకు వచ్చే జనానికి మూడు మునకలు వేయడమే ప్రధానం తప్ప సాంస్కృతిక కార్యక్రమాలు కాదు.
కానీ చంద్రబాబు పుష్కరాల కోసం కోట్లు ఖర్చు చేసారు. వాటిలో కొంత భాగమైనా భాష కోసం ఖర్చు చేసి ఉంటే తెలుగు బాగుపడేది.
Image result for యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
అలాగే ఆయన తన సమయంలో కొంతైనా తెలుగు కోసం కేటాయించాలని సూచించారు. ఇంటర్ వరకూ తెలుగు ఒక సబ్జక్టుగా తప్పనిసరిగా ఉండాలని ఏపీ సర్కారు తెచ్చిన జీవో కూడా భాషా వేత్తల ఒత్తిడి కారణంగానే వచ్చిందని అన్నారు. ఓవైపు కేసీఆర్ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సమయంలో కేవలం తప్పనిసరై మాత్రమే చంద్రబాబు ఆ జీవో తెచ్చారని.. కానీ దాన్ని అమలుచేయడంలేదని మండిపడ్డారు. జీవో తెచ్చిన మరుసటిరోజే అసెంబ్లీలో సభ్యులను అవమానపరుస్తూ మీరు  విదేశాల్లో ఉన్న మీ పిల్లలతో ఏ భాషలో మాట్లాడుతున్నారని వెటకారం ఆడారని యార్లగడ్డ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: