భారత ఆర్థిక స్థితిని విచ్చిన్నం చేయడానికి  దొంగ నోట్లు ముద్రించి భారత్  మార్కెట్ వ్యవస్థను అస్తవ్యస్థం చేయబోతున్నట్లు తెలిస్తే..ప్రతి ఒక్క భారతీయుడు ఆవేదన చెందుతారు.   రూ.500, రూ.200, రూ.50 నోట్లు ముద్రించి  కోట్లాది రూపాయలు కంటెయినర్ల ద్వారా  భారత్ కి తరలిస్తూ..భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి.  గత సంవత్సరం దేశంలో దొంగ నోట్ల నిర్మూలన, నల్ల ధనం నిర్మూలన అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు లాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

అప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 ప్లేస్ లో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లు చలామణిలోకి తీసుకు వచ్చాయి.  అయితే కొన్ని నెలల తర్వాత పెద్ద నోట్లకు చిల్లర కష్టాలు రావడంతో రూ.200, రూ.50 నోటు ముద్రించి చలామణిలోకి తీసుకు వచ్చారు.  అయితే కొంత కాలంగా పాకిస్థాన్ ఉగ్రదాడులు జరుపుతున్న విషయం తెలిసిందే..దాంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి దొంగనోట్లు ముద్రించి వేల కోట్లు భారత్ కి తరలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఈ మద్య ప్రతి భారతీయుడూ విసృతిపోయే విధంగా బంగ్లాదేశ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్..అయితే ఇది మాత్రం ఎక్కడుందో..అక్కడ ఇంకేమి ముద్రిస్తారో తెలియదు కానీ.. భారత దేశానికి చెందిన నకిలీ కరెన్సీని అక్కడ ముద్రిస్తున్నారు.  రెండు వేలు, ఐదు వందలు నుంచి 50 రూపాయల నోట్లు విపరీతంగా ముద్రిస్తున్నారు. 

అవి చూడటానికి అచ్చం కొత్త కరెన్సీ మాదిరిగా ఉండటం మరో విశేషం. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన కరెన్సీని సరిహద్దులు దాటించి, భారత్ లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఎవరు తీశారో, ఎవరు తొలుత సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న సమాచారం లేదుగానీ, ఇదిప్పుడు తెగ వైరల్ అవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: