దేశంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది! కేంద్రంలోని మోడీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందన్న సమాచారంతో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ పార్టీ ముఖ్యులను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మోడీ ప్ర‌భుత్వం ఆరు నెల‌ల ముందుగానే అంటే ఈ న‌వంబ‌ర్‌లోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చూస్తోంది. కేంద్రం ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళితే మ‌న‌మూ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. బ‌డ్జెట్ స‌మావేశాల త‌ర్వాత ఎవ‌రికి వాళ్లు పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని కేసీఆర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.
Image result for modi

ఈ లోగా ఎక్క‌డిక్క‌డ స‌గంలో ఉన్న అభివృద్ధి ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయ‌డంతో పాటు కొత్త పనుల‌పై దృష్టి పెట్టి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వాటిని కూడా పూర్తి చేసుకునేలా ప్లాన్లు వేసుకోవాల‌ని కూడా కేసీఆర్ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది. కేంద్రం ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న‌లో ఉండ‌డంతో మ‌నం కూడా అందుకు ఇప్ప‌టి నుంచే రెడీ అవ్వాల‌ని కూడా కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నట్లు టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

Image result for telangana

ఈ ప్లాన్‌తోనే కేసీఆర్ రాష్ట్రంలో కులాల వారీగా ఓట్లు కొల్ల గొట్టేందుకు చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కులాలు, వర్గాల వారీగా ప్రకటిస్తున్న వరాలు, పార్టీలోకి జరుగుతున్న చేరికలు వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలకు చిహ్నంగా నిలుస్తున్నాయి. అందుకే కేసీఆర్ కూడా వివిధ స‌ర్వేల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరుపై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు రావ‌డంతో పాటు ప‌నితీరు స‌రిగా లేని స్థానాల్లో కొత్త వారి కోసం రెండు మూడు పేర్ల‌తో లిస్టు కూడా రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Image result for elections

ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ఆహ్వానించే ప‌నిలో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు పార్టీ వీక్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వానించే కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రంగా చేప‌డుతున్నార‌ట‌. ఇందుకోసం ఓ భారీ క్యాంపెయిన్ కార్య‌క్ర‌మం కూడా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నెల 15న నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆ రోజు బీజేపీ తన వైఖరిని ఖరారు చేస్తుందన్న సమాచారం ఉన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జూన్‌ 2వ తేదీతో శాసన సభ కాల పరిమితి పూర్తవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: