రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం.. గెలుపోటములూ సహజం.. కానీ.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే గెలిచీ ఓడినట్టుంది.. ఓడీ గెలిచినట్టుంది. ఏపీలో అధికారంలో ఉన్నా ఆయనకు అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారానికి వచ్చిన ఇబ్బంది ఏదీ లేకున్నా.. కేంద్రం విషయంలో మాత్రం ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది. మిత్రపక్షం అధికారంలో ఉన్నా సహాయం చేసే విషయంలో అంత సుముఖంగా కనిపించడం లేదు. 


ఒకప్పుడు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారు. ప్రధాన మంత్రులను సైతం తానే నిర్ణయంచే రేంజ్ లో ఆడుకున్నారు. దేశ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ ఇఫ్పుడు ఆయన ఏపీ అభివృద్ధి కోసం పదే పదే కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోంది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఆయన్ను అంతగా ఖాతరు చేయడం లేదు. కొత్తగా ప్రత్యేక సాయం చేయకున్నా.. ఇస్తామన్న వాటి విషయంలోనూ సానుకూలత కనిపించడం లేదు. 

BABU JAITLY కోసం చిత్ర ఫలితం

పోలవరం విషయం అంతే.. ప్రత్యేక ప్యాకేజీ విషయమూ అంతే.. ప్రత్యేక ప్యాకేజీలో చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసే ఆర్థిక సాయాన్ని విదేశీ ఆర్థిక సంస్థలనుంచి కాకుండా నాబార్డు నుంచి గ్రాంట్‌ రూపంలో అందించాలని కోరుతూ ఆయన మళ్లీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాయాల్సి వచ్చింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన ప్రకారం కేంద్ర ప్రాయోజిత పథకాలకింద 2015 నుంచి 2020 వరకూ ఏపీకి 16,447 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుందనే విషయాన్ని పదే పదే గుర్తు చేయాల్సి వస్తోంది. 

సంబంధిత చిత్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మీరు ప్రకటించిన ప్రత్యేక సహాయచర్యలను గుర్తుతెచ్చుకోండంటూ చంద్రబాబు అరుణ్‌జైట్లీ కి లేఖ రాశారు. 2015-20 మధ్య కాలంలో తీసుకున్న విదేశీరుణాలు, వడ్డీలను తానే తిరిగి చెల్లిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని చంద్రబాబు జైట్లీకి తన లేఖలో గుర్తు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను 90:10 నిష్పత్తిలో ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు 2015-16 సంవత్సరానికి 2,951 కోట్ల రూపాయల అధిక నిధులు రావాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని 2,516కోట్ల రూపాయలుగా మాత్రమే అంచనా వేసింది. ఇలాంటి విషయాలన్నీ ఆయనే స్వయంగా గుర్తు చేయాల్సి వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: