ప్రమాదాలు ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు..అప్పటి వరకు తమతో ఎంతో ఆనందంగా గడిపిన వారు..ఒక్కసారే కనిపించకుండా..శాశ్వతంగా దూరమయ్యారంటే..ఎంత ఆవేదన ఉంటుందో ఊహించలేం.  తాజాగా వీకెండ్ అని విహార యాత్రకు వెళ్లిన వారు ఉన్నట్టుండి ప్రమాదానికి లోనైతే వారి కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణనాతీతం.
Image result for maharashtra boat capsizes
తాజాగా మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. 40 మంది విద్యార్థులతో వెళుతోన్న పడవ బోల్తా పడింది. గ‌ల్లంతైన విద్యార్థుల కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 25 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.
Image result for maharashtra boat capsizes
తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. ప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 36 మంది విద్యార్థులను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలు పంచుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: