తెలుగు పల్లెలకు కొత్త కళ వచ్చింది. సంక్రాంతి రాకతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. బతుకు తెరువుకు పట్నం బాట పట్టినా సంక్రాంతికి మాత్రం అమ్మ ఒడి చేరినట్టు అంతా పల్లె గూటికి చేరుకున్నారు. ఆత్మీయులతో కలసి పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. పండుగ ప్రయాణాలతో రైల్వేస్టేషన్, ఆర్టీసీ ప్రాంగణాలు సందడిగా మారాయి. ప్రయాణీకుల రద్దీతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. సొంతూళ్లకు వచ్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. 

sankranthi festival కోసం చిత్ర ఫలితం
రెండు రాష్ట్రాల ఆర్టీసీలు  సైతం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. రైళ్లలో కాలు పెట్టుకునేందుకు ఖాళీ లేక, ప్రయాణీకులు ఇబ్బందులు పడి మరీ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మూడురోజుల పండగకు పిల్లలు, లగేజీలు వెంటేసుకుని దూరప్రాంతాల నుంచి రావడం, తిరిగి వెళ్లడం నరకయాతనే అయినా పల్లెటూళ్లో సంక్రాంతి జరుపుకునే సంతోషం ముందు అంతా దిగదుడుపే మరి. అధికారులు కొన్ని ప్రత్యేక రైళ్లు వేస్తున్నప్పటికీ వేస్తున్నప్పటికీ ప్రయాణీకులకు మాత్రం పాట్లు తప్పడం లేదు.

sankranthi festival కోసం చిత్ర ఫలితం
ప్రధానంగా హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు మీదుగా విశాఖపట్నం వెళ్లే రైళ్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మందికూర్చునేందుకు చోటులేక బాత్ రూమ్ ల పక్కన, తలుపుల వద్ద కూర్చుంటున్నారు. మరికొందరు ఒంటికాలిపై నిల్చుంటూ ప్రయాణం చేస్తున్నారు. 2,3 నెలల ముందే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ సాధారమణ ప్రయాణికులు సైతం విధిలేని పరిస్థితుల్లో వాటిలోకి ఎక్కి ప్రయాణిస్తున్నారు. 

sankranthi rush కోసం చిత్ర ఫలితం
ప్రయాణాలతో ఎన్ని ఇబ్బందు పడినా సొంత గూటికి చేరే సరికి ఆ ఇబ్బందుల్లనీ క్షణంలో మటుమాయం అవుతున్నాయి. పండుగ మూడు రోజులు సంబరాలతో గుండెతా సంతోషం నింపుకుని.. మళ్లీ ఏడాదికి సరిపడా ఉత్సాహాన్ని పోగేసుకుని తిరుగుప్రయాణం సాగిస్తారు. ఈ మూడు రోజులు పట్నాలు మాత్రం కళతప్పుతాయి. ఊళ్లకు వెళ్లని కొద్దిమంది పట్నంలో పల్లెను చూసుకుంటూ టీవీల్లో వేడుకలు చూసుకుంటూ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: