ఒక ముస్లిం దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళ బెనజీర్ భుట్టో. ఆమె హత్య జరిగి దశాబ్దం గడిచింది. ఆమె హత్య వెనుక ఎవరున్నారనేది ఇంతవరకూ వెల్లడి కాలేదు. పాకిస్తాన్‌‌లో వ్యవస్థల పనితీరు ఎలా ఉంటుందో ఈ కేసు దర్యాప్తు తీరే తేటతెల్లం అవుతుందని పలు మీడియా వర్గాలు సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నాయి. 2007 డిసెంబరు 27న ఎన్నికల ప్రచారంలో భాగంగా బెనజీర్ భుట్టో రావల్పిండిలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు. 
బెనజీర్ భుట్టో
ర్యాలీ ముగిసిన వెంటనే బిలాల్ అనే పదిహేనేళ్ల బాలుడు బెనజీర్ కాన్వాయ్‌ వద్దకు వచ్చి, ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అతడు తనను తాను పేల్చేసుకున్నాడు. మరోవైపు  పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ దేశ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చంపించారంటూ పర్వేజ్ ఆరోపించారు. దీనికి సంబంధించి ముషర్రఫ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
బెనజీర్ భుట్టో హత్యపై ముషర్రఫ్ సంచలన ఆరోపణ
బెనజీర్ మృతికి కారణం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సుప్రీం నేత అసిఫ్ జర్దారీ అని తన మెసేజ్‌లో పర్వేజ్ ఆరోపించారు. బెనజీర్ హత్య వెనుక తన పాత్ర ఉందని జర్దారీ ఆరోపిస్తున్నారని, అందుకే ఈ ప్రకటన చేయాల్సి వస్తుందని మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ తెలిపారు. ఇలా ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది.  పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టోను తామే హత్య చేశామని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
బెనజీర్ భుట్టో
ఇంక్విలాబ్‌ మెహ్‌సూద్‌ సౌత్‌ వజీరిస్థాన్‌ అనే పుస్తకంలో తాలిబాన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రవాదులు చేసిన ఘోరాలను వివరిస్తూ 2017 నవంబర్‌ 30న ప్రచురించిన ఈ పుస్తకం ఆదివారం విడుదలైంది. ఈ పుస్తకాన్ని తాలిబాన్‌ నేత అబూ మన్సూర్‌ అషీమ్‌ ముఫ్తీ రాశాడు.ఈ పుస్తకాన్ని తాలిబాన్‌ నేత అబూ మన్సూర్‌ అషీమ్‌ ముఫ్తీ రాశాడు.. 588 పేజీలున్న ఈ పుస్తకంలో పలువురు తాలిబాన్‌ నేతలు, వారు చేసిన ఘోరాలను ప్రచురించారు ఎంతమందిని ఏ రకంగా హత్య చేశారనే విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.
Image result for banerjee bhutto death
బిలాల్‌ అలియాస్‌ సయీద్‌, ఇక్రాముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి బాంబుల ద్వారా భుట్టోను చంపినట్లు ఈ పుస్తకంలో వెల్లడించారు. ఆత్మాహుతి అనంతరం ఇక్రాముల్లా తప్పించుకున్నాడని ఆయన ఆ పుస్తకంలో రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: