ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం గోషామహల్ ట్రాఫిక్‌‌ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ హాజరైన ప్రదీప్.. ఇంత వరకూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ప్రదీప్ తప్పించుకు పారిపోయాడు..ఒకదశలో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు దుమ్మురేపాయి. 
Image result for anchor pradeep drunk and drive case
ఈ నేపథ్యంలో తాను షూటింగ్ బిజీలో ఉండటం వల్ల హాజరు కాలేక పోయానని..పోలీసులు, చట్టం అంటే తనకు ఎంతో గౌరవం అని వాటిని తాను గౌరవిస్తానని అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.   ఈ నెల 8 న ప్రదీప్ తన తండ్రితో కలిసి గోషా మహల్ ట్రాఫిక్ పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరైన సంగతి తెలిసిందే. అనంతరం 16 న కోర్టుకు హాజరు కావలసి ఉండగా..ఆ రోజున సెలవు దినమైనందున 22 న హాజరవుతానని తెలిపాడు.  నాంపల్లిలోని నాలుగో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రదీప్‌ను పోలీసులు హాజరు పరచనున్నారు.
Image result for యాంకర్ ప్రదీప్
అదేరోజు ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే.. ప్రదీప్‌ను కౌన్సిలింగ్‌కు రప్పించడానికి నానా తంటాలు పడిన పోలీసులు ఈసారి కోర్టుకు హాజరుపరచడం కోసం యాంకర్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.! ఇదివరకే సంక్రాంతి పండగ మరుసటి రోజు అనగా 16న కోర్టుకు హాజరవుతానని చెప్పి తాజాగా మళ్లీ తేదీ మార్చేశాడు ప్రదీప్. కాగా 16న సెలవు కావడంతో ఎట్టకేలకు 22న నాంపల్లి కోర్టుకు వస్తానని పోలీసులకు యాంకర్ ప్రదీప్ వివరించినట్లుగా తెలుస్తోంది. 
Image result for యాంకర్ ప్రదీప్
కోర్టు శిక్ష విధిస్తుందా? లేకుంటే జరిమానా విధించి ప్రదీప్‌ను వదిలేస్తుందా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. మొత్తానికి ఎన్ని యాంగిల్స్ లో తప్పించుకోవాలని చూసినా..తాను చేసిన పని తనకు శాపంగా మారి శిక్ష పడక తప్పదని తెలిసినా...యాంకర్ ప్రదీప్ ధైర్యం చేసి కోర్టు లో హాజరు అయితే  శిక్ష పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: