అజ్ఞాత వాసి సినిమా పవన్ కల్యాణ్ ను, ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో ఇదే అతి పెద్ద లూజర్ గా మిగిలింది. సంక్రాంతి రేసులోనే కాదు ఇటు పవన్ కల్యాణ్ కూ.. అటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కేరీర్లోనూ చెత్త సినిమాగా నిలిచిందనే అంచనాలు ఉన్నాయి. అసలు సినిమాను చాలా ఎక్కువ నిడివితో తీయడం.. చివరలో సమయం లేక ఇష్టారీతిన ఎడిటంగ్ చేయడంతో సినిమా అర్థం పర్థం లేకుండా తయారైందనేది ఓ విశ్లేషణ. 


' అజ్ఞాత‌వాసి ' బొక్క‌ల లెక్క‌లివే... ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌
దాదాపు రూ.125 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమాకు తొలి రోజు రూ.40 కోట్ల షేర్ రాగా రెండో రోజు నుంచి దారుణంగా తేలిపోయింది. సినిమా దారుణంగా ఫెయిలవడంతో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగినట్టేనని సినీజనాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓ సంచన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే.. ఈ సినిమా కోసం పవన్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారట. 

Image result for agnathavasi
డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు కొంతవరకైనా తగ్గించాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ దాదాపు 15 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారట. ఇదే నిజమైతే డిస్ట్రిబ్యూటర్లకు కొంతలో కొంత కాస్త ఊరట కలిగించే అంశమే అవుతుంది. 

Image result for agnathavasi

ఇలా డిస్ట్రిబ్యూటర్ల కష్టనష్టాల గురించి పట్టించుకునే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. తమిళంలో సూపర్ స్టార్ రజీనీకాంత్ ఇలాగే చేస్తుంటారు. తన సినిమాలు బాబా, లింగ సినిమాలు దారుణమైన ఫ్లాప్ లుగా మిగిలిపోయిన సమయంలో ఆయన డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను తన సొంత ఖర్చు నుంచి భరించారు. మరి అసలే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న పవన్ అందరి కష్టాలు పట్టించుకోవాలిగా..



మరింత సమాచారం తెలుసుకోండి: