ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ గత కొంత కాలంగా సినీ నిర్మాతలను టార్గెట్ చేస్తున్నారు ఆదాయపు పన్ను అధికారులు.  తాజాగా సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలు రిలీజ్ చేసి మంచి జోష్ మీద ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించారు.  మొత్తం 8 మంది నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై  బుధవారం ఉదయం నుంచి ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. సి.కల్యాణ్, రాధాకృష్ణ, శరత్‌మరార్, సురేష్‌బాబు, డీవీవీ దానయ్య, ఆనంద్ ప్రసాద్ సహా పలువురు నిర్మాతల ఆఫీసులపై తనిఖీలు జరుగుతున్నాయి.
Related image
దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘జై సింహా’ ఫస్ట్ వీక్ రూ.12 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. కృష్ణా నగర్‌లోని కళ్యాణ్ ఆఫీసులో ఈ దాడులు జరిగాయి.టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో కళ్యాణ్ ఒకరు. కృష్ణా నగర్‌లోని ఆఫీసుతో పాటు జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి సమీపంలోని ఉన్న మరో అఫీసు మరియు ఫిల్మ్ నగర్‌లోని ఆయన తమ్ముడి ఇంట్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.
Image result for producer c kalyan
తొలుత కార్యాలయంలో సోదాలు ముగిసిన తర్వాత ఇంటిలోనూ సోదాలు చేపట్టారు. మరోవైపు టీడీఎస్ వెరిఫికేషన్స్ కోసం ఐటీ అధికారులు వచ్చారని, అన్నివివరాలను వాళ్లకు ఇచ్చామని శరత్ మరార్ తెలిపాడు. గతంలో సినిమా రిలీ‌జ్‌కి ముందుగానీ తర్వాతగానీ సంబంధిత ప్రొడ్యూసర్స్ ఇళ్లు, ఆఫీసులపైనే అధికారులు సోదాలు. ఈసారి ఏకంగా 8 ప్రొడ్యూసర్ల ఇళ్లపై సోదాలు చేయడంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: