నారా లోకేశ్, కేటీఆర్... ఈ ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. ఇద్దరూ ప్రముఖ ముఖ్యమంత్రుల కుమారులే.. ఇద్దరూ తండ్రి వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి వచ్చినవారే... కాకపోతే కేటీఆర్ కాస్త ముందు.. లోకేశ్ కాస్త వెనుక. కేటీఆర్ కు కాస్త ఉద్యమ నేపథ్యం ఉంటే.. లోకేశ్ కు పార్టీ కోసం పని చేసిన అనుభవం ఉంది. కేటీఆర్ 2014లోనే మంత్రి పదవి అందుకుంటే... నారా లోకేశ్ రెండేళ్లు ఆలస్యంగా తొమ్మిది నెలల కిందటే అమాత్య పదవి అలంకరించాడు.



గత చరిత్ర చూసినా.. ఇధ్దరూ అమెరికాలోనే చదువులు పూర్తి చేసుకున్నారు.  విచిత్రంగా కేబినెట్లోకి వచ్చిన తర్వాత ఇధ్దరూ ఐటీ శాఖలనే మంత్రిత్వ శాఖలుగా ఎంచుకున్నారు. ఇధ్దరూ దేశ, విదేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం పర్యటనలు చేసిన వాళ్లే.. అయితే కేటీఆర్ కు చాలా సానుకూలతలున్నాయి. అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఆయనకు ప్లస్ పాయింట్ కాగా.. నారా లోకేశ్ కు ఇంకా నిర్మించని అమరావతి మాత్రమే ఉంది. 



అందుకే అమరావతిని ఐటీ సిటీగా మార్చేందుకు నారా లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ఎన్నార్టీ సంస్థ ద్వారా లాబీయింగ్ చేసి అమెరికాలోని ఎన్నారైల ద్వారా సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టిస్తున్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం ఇలా నాలుగుచోట్ల ఐటీ ఉద్యోగాల స్థాపన కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంగళగిరిలో 16 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించారు. 



హైదరాబాద్ లో చంద్రబాబు ఐటీ ప్రారంభించి దాదాపు పాతికేళ్లు అవుతోందని.. నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈ పాతికేళ్లలో ఇప్పటికి 6 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉద్యోగాల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని.. అమరావతి , తిరుపతి, విశాఖ, అనంతపురంలను క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నాలుగు క్లస్టర్లల్లో రాబోయే పదేళ్లలో ఒక్కోదాంట్లో రెండున్నర లక్షల ఉద్యోగాలను టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు. కేటీఆర్.. వింటున్నారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: