ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నందువల్ల ఎన్నో నిధులు రాష్ట్రానికి తెచ్చుకోవచ్చని కలలుకన్నారు. అందులోనూ అసలే విభజన సమస్యలతో సతమతమవుతున్న తమకు కేంద్రం అండగా నిలుస్తుందని ఆశించారు. కానీ కాలక్రమంలో ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. మోడీ నుంచి ఆశించినంత సాయం ఏపీకి అందడం లేదు. ఈ విషయంలో చంద్రబాబులో ఎంతో అసంతృప్తి ఉంది. 



మరీ దారుణమైన విషయం ఏంటంటే.. చంద్రబాబుకు మోడీ అపాయిట్ మెంట్ కూడా దొరకడం లేదు. ఎందుచేతలో మోడీ చంద్రబాబు అంటే తగని నిర్లక్ష్యం చూపుతున్నారు. క్రమంగా ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య మైత్రి కూడా అంత సజావుగా సాగడం లేదు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసిపోటీ చేస్తాయన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. అలాంటి సమయంలో చంద్రబాబు మోడీని పరోక్షంగా పొగడ్తలతో ముంచేశారు. నిన్న ఏపీలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ వింత చోటు చేసుకుంది. 

niti aayog rajiv kumar కోసం చిత్ర ఫలితం
గతంలో దేశంలో ప్రణాళిక సంఘం ఉండేది. దీని నివేదికల ఆధారంగానే కేంద్రం- రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ జరిగేది. మోడీ వచ్చాక ఆ ప్రణాళిక సంఘాన్నిరద్దు చేశారు. కొత్తగా నీటి ఆయోగ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త వ్యవస్థపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సుకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ను ఆహ్వానించారు. ఆయనపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 


గతంలో తాను చాలా సార్లు ప్రణాళికా సంఘం సమావేశాలకు హాజరైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అందులో అడిగిన దానికి పదో, ముప్పయ్యో కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకునే వారని.. తన పరిచయాలను వినియోగించి ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేవాడినని చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారిందని.. నీతి ఆయోగ్ చక్కగా పనిచేస్తోందని మెచ్చుకున్నారు. ఏపీ వృద్ధిని శాస్త్రీయంగా నమోదు చేస్తున్నామని, రాష్ట్రాన్ని పసిపాపలా సాకుతున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ నుంచి భవిష్యత్తు లో మరింత సహకారాన్ని ఏపీ ఆశిస్తోందని చంద్రబాబు అన్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కపూర్ మెప్పు కోసమో.. లేక.. రాజీవ్ కుమార్ ద్వారా మోడీ మెప్పు కోసమో కానీ..మొత్తానికి నీతి ఆయోగ్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: