రోజురోజుకు సమాజములో హింస పెరిగి పెట్రేగి పోతుంది. ఒక విద్యార్ధి ఒక రోజు స్కూలుకు డుమ్మా కొట్టేయాలనిపిస్తే చాలు కుదరని పక్షములో ఒక తోటి విద్యార్ధిని చంపేసి తద్వారా స్కూలుకు సెలవు ప్రకటిన సందర్భంగా వినోదించిన వైనాన్ని చూశాం లేదా చదివాం. 


ఇప్పుడు మరో వైపరీత్యమేమంటే తాను చదువుతోన్న కళాశాల ప్రిన్సిపాల్‌ను ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి నిన్న శనివారం  తన తండ్రి రివాల్వర్‌తో ధారుణంగా కాల్చి చంపిన ఘటన హరియాణా రాష్ట్రంలో సంభవించింది. యమునా నగర్‌ లోని స్వామి వివేకానంద పబ్లిక్ స్కూల్  కళాశాల ప్రిన్సిపాల్‌ రీతూ చాబ్రా ను ద్వితీయ ఇంటర్ విద్యార్థి తన తండ్రి రివాల్వర్‌ తో కాల్పుల జరపడం తో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. 

Image result for yamunanagar haryana student fires principal


చదువు లో బలహీనత కృషిలో వెనుకబడటమే కాకుండా హాజరు తక్కువ ఉండటం కారణంగా  తరచూ ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో నిందిత విద్యార్ధి గొడవ పడటంతో ప్రిన్సిపాల్ రీతూ చాబ్రా (46)  తనను మందలించారు. శనివారం పేరెంట్-టీచర్ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరైన సమయం లో ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి తనతో తెచ్చుకున్న రివాల్వర్‌ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


కోచింగ్ క్లాస్ ఉందని తల్లిదండ్రుల తో చెప్పిన నిందితుడు, ఇంట్లో తనతండ్రి లైసెన్స్డ్ రివాల్వర్‌ను తన వెంట తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. ఉదయం 11.30 గంటలకు ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లి రివాల్వర్‌ తో కాల్చినట్లు యుమనా నగర్ పోలీస్ సూపరింటిండెంట్ ఎస్పీ రాజేశ్ కైలా తెలిపారు. ఆ సమయంలో రీతూ చాబ్రా తన కాబిన్ లో ఒంటరిగా ఉన్నారని, ఈ నిందిత విద్యార్ధి కాల్చిన వాటిల్లో రెండు బుల్లెట్లు చేతుల్లోకి, మరో బుల్లెట్ ఆమె చాతీలోకి దూసుకుపోయాయి. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన ఆమెను వైద్యం కోసం హాస్పిటల్‌ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన తెలిపారు. 

Image result for yamunanagar haryana student fires principal

కామర్స్ విద్యార్థులకు ఎకనమిక్స్ బోధించే రీతూ చాబ్రా, నిందితుడు ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్‌ లో సరైన ప్రతిభ చూపకపోవడం, ప్రాక్టిక ల్ రికార్డ్స్ సకాలంలో సమర్పించక పోవడం తో కొంచెం ఆగ్రహంతో మందలించారు. అంతేకాదు అతడి రికార్డ్స్ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో అహం దెబ్బతిని ఆమెను హత్య చేయాలని ఆ విద్యార్ధి భావించాడు. నిందితుడు, అతని తండ్రినిసైతం అదుపు లోకి తీసుకున్న పోలీసులు నేర విచారణ చేపట్టారు. నిందిత విద్యార్థిని తమ ప్రిన్సిపాల్ మందలిం చారనే కోపం కక్ష తో అతడు కాల్పులకు తెగించాడని యమునా నగర్ వివేకానంద కళాశాల యాజమాన్యం పేర్కొంది.

Image result for yamunanagar haryana student fires principal

మరింత సమాచారం తెలుసుకోండి: