ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉండగానే అప్పుడే పార్టీలు ఎన్నికల వేడి పుట్టించేస్తున్నాయి. ఈ వేడి తెలంగాణలో కంటే ఆంధ్రా ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కు పెద్దగా ఎదురులేకపోవడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్ల ఇక్కడి పోరుపై ప్రజల్లోనూ అంత ఆసక్తి కనిపించడం లేదు. ఎలాగైనా మళ్లీ తెలంగాణ కేసీఆర్ దే అధికారం అన్న భావన రాజకీయ విశ్లేషకుల్లోనూ కనిపిస్తోంది. కాస్త మెజారిటీలోనే అటూ ఇటూ కావచ్చేమో.

TDP VS YSRCP కోసం చిత్ర ఫలితం
కానీ ఆంధ్రాలో పరిస్థితి అలా కాదు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ఇది జీవన్మరణ సమస్య. ఈసారి వైసీపీ సత్తా చాటకపోతే..ఇక ఆ పార్టీకి రాజకీయ మనుగడ అంటూ ఉండటం కష్టమే. అందుకే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్ని శక్తులూ కేంద్రీకరించి పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ జాతీయ సర్వే ఆ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఏపీలో టీడీపీ కంటే వైసీపీ కాస్త ముందంజలో ఉందని తెలిపింది. 

TDP VS YSRCP కోసం చిత్ర ఫలితం
టీడీపీ కూటమికి 12 ఎంపీ స్థానాలు వస్తే.. వైసీపీకి 13 స్థానాలు వస్తాయని ఆ ఛానల్ చెప్పింది. ఐతే.. ఇదంతా బోగస్ అంటున్నారు టీడీపీ నేతలు. అంతేకాదు.. అసలు తమ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎదురేలేదంటున్నారు. ఆ పార్టీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ 135 నుంచి 145 స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఈ స్థానాల్లో వైసీపీకి అభ్యర్థులు కూడా లేరట. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోసం చిత్ర ఫలితం

టీడీపీ- వైసీపీ మధ్య పోటీ ఉన్న స్థానాలు కేవలం 35నుంచి 40 మాత్రమేనట. ఆ నలభైలోనే పోటీ ఉంటుందట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో మళ్లీ తమదే అధికారం అంటున్నారు అధికార పార్టీ నేతలు.. అంతే కాదు.. ఈ రిపబ్లిక్ సర్వే పక్కా పెయిడ్ సర్వే అని తేల్చి చెబుతున్నారు. ఈ ఛానల్ తో జట్టు కట్టిన సీ ఓటర్ సర్వేలు ఇప్పటివరకూ ఏదీ నిజం కాలేదని పాత లెక్కలు వినిపిస్తున్నారు. ఇదే సంస్థ గత ఎన్నికల సమయంలోనూ వైసీపీ గెలుస్తుందని చెప్పిందని.. కానీ ప్రజలు తమ తీర్పుతో టీడీపీకి పట్టం కట్టారని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: