సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు టెండర్ ఎవరికి ఇస్తారు.. తక్కువ ధరకు చేస్తామన్నవారికే ఇస్తారు.. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేదే.. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేయాలనే పాలకులు కూడా కోరుకునేది అదే. అయితే తక్కువధరకు పని చేస్తామని ఓ కేంద్రప్రభుత్వ సంస్థ ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగీకరించడం లేదు. చట్టప్రకారం టెండరు దక్కించుకునే వీలున్నా పాపం ఆ సంస్థకు టెండర్ దక్కడం లేదు. అంతే కాదు.. ఏకంగా ఆ టెండర్ రద్దు కూడా కాబోతోంది.

Image result for tdp

ఈ విచిత్రం భోగాపురం విమానాశ్రయ నిర్మాణం విషయంలో చోటు చేసుకుంది. ఏపీ సర్కారు భోగాపురం విమానాశ్రయాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు అనేక వేల ఎకరాల భూమి సేకరించింది కూడా. ఇందుకు టెండర్లు కూడా పిలిచింది. ఆ టెండర్లలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తక్కువ ధరకు టెండర్ వేసింది. దీన్ని ఆమోదించాల్సిన ఏపీ సర్కారు ఆశ్చర్యకరంగా ఆ టెండర్లనే రద్దు చేసేసింది.

Image result for ysrcp

భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే టెండర్లు రద్దు చేస్తున్నామని కొత్త సాకులు వెదుకుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం టెండర్ రద్దుచేయడంలోనూ ముఖ్యమంత్రికి దురుద్దేశాలు ఉన్నాయన్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఆప్ ఇండియాను కాదని టెండర్ రద్దు చేయడం విడ్డూరమన్నారు.

Image result for ambati rambabu

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు టెండర్ దక్కితే ముడుపులురావనే సీఎం వాటిని రద్దు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. భావనపాడు పోర్టును ఆదానీ కంపెనీకి అప్పగిస్తున్నారని, ఆ కంపెనీపై ఈడీ కేసులున్నాయని రక్షణ శాఖ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. దుగరాజపట్నం పోర్టు వదులుకుంటామని కేంద్రానికి చెప్పడం వెనుక కృష్ణపట్నం పోర్టు నిర్వాహకులకు లబ్ది చేకూర్చే ఉద్దేశం ఉందని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం 14 వేల 700కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడానికి సిద్దమవుతోందని, టెండర్లలో ముడుపుల కోసమే ఈ పద్దతిలో పనుల చేపడుతున్నారని అంబటి విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: