ఓ మహిళా అధికారి అక్రమ సంబంధం కారణంగా ఇప్పుడు అభాసుపాలైంది. నాలుగు గోడల మధ్య వ్యవహారం రోడ్డున పడి ఇప్పుడు పరువు గంగపాలైంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అక్రమ సంబంధం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఎసిబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న సునీతారెడ్డితో గత కొంతకాలంగా సిఐ మల్లిఖార్జునరెడ్డి అక్రమ సంబంధం నడుపుతున్నాడు. ఈ  వ్యవహారంపై పలుమార్లు గొడవుల అయ్యాయి. సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు.
illegal affair
దీంతో ఎసిబిలో ఉన్న మల్లిఖార్జునరెడ్డిని కల్వకుర్తికి బదిలీ చేశారు. కానీ ఆ సీఐ అక్రమ సంబంధం తెగిపోలేదు. అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండురోజులుగా వీరి బండారాన్ని బయట పెట్టేందుకు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పథకం ప్రకారం వ్యవహరించారు... గుట్టు రట్టు చేశారు.  సురేందర్ రెడ్డి తల్లి, ఆయన అత్త ఇద్దరూ ఈ విషయంలో సురేందర్ కు సహకరించారు. ఇక సిఐని అర్థరాత్రి ఇంటికి వచ్చిపోతుండగా మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. 

ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్న ఉన్నతాధికారిలు కల్వకుర్తి సీఐ మల్లిఖార్జున రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సీఐపై వేటు వేశారు. రాసలీలల వ్యవహారంలో విచారణ జరిపి మల్లికార్జున్‌రెడ్డిపై ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర వేటు వేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.కాగా.. ఈ సస్పెన్షన్‌కు ముందు మహిళా అధికారి ఏఎస్పీ స్టేట్ మెంట్‌‌ను కూడా కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేశారు. ఆమె తన ఇష్టపూర్వకంగానే సీఐతో ఉన్నట్టు తెలియజేసిందని పోలీసు వర్గాల సమాచారం.
అక్రమ సంబంధం సిఐ పై వేటు
నాగర్ కర్నూలు ఎస్పీకి నివేదిక పంపారు. అంతిమంగా సిఐ మల్లిఖార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక సునీతారెడ్డిపై ఏ రకమైన చర్యలుంటాయన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. మరోవైపు సీఐ మల్లికార్జున్‌రెడ్డి, మహిళా అధికారి వేర్వేరుగా విడాకులకు అప్లయ్‌ చేశామని, త్వరలోనే తామిద్దరం వివాహం చేసుకుంటామని సన్నిహితులతో సీఐ మల్లికార్జున్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఎంతటిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: