అలస్కాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 8.2గా నమోదైంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలస్కాలోని చినియాక్‌కు 256 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో మంగళవారం ఉదయం 9.31 గంటలకు (జనవరి23)  ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.
bukam
సునామీ వచ్చే అవకాశం ఉండ‌టంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ అలస్కా, బ్రిటీష్‌ కొలంబియా సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని,  సముద్ర తీర ప్రాంతంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి అంటూ అలస్కా, బ్రిటీష్‌ కొలంబియా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

అలస్కా, కెనడా, అమెరికా పశ్చిమ ప్రాంతంపై సునామీ ప్రభావం ఉంటుందని తెలిపింది. సునామీ కారణంగా రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: