ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు పార్టీలు ఇప్పటి నుంచే మాటల యుద్ధం ప్రారంభించాయి. అధికారంలో ఉన్న టీడీపీ మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నా ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న కొద్దీ ఈ స్నేహం ఎంతవరకూ ఉంటుందో తెలియని స్థితి ఉంది. ఐతే.. నరేంద్రమోడీ సర్కారుకు మద్దతిస్తూ.. అందులో భాగంగా కొనసాగడం తప్ప టీడీపీకి వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. 



ఇక ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే.. కేంద్రంతో సఖ్యతగా ఉందామని ఆ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ అధికార టీడీపీతో జట్టుకట్టినా తాను కూడా కమలంతో దోస్తీ కోసం వీలైనంత వరకూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీజేపీ నుంచి టీడీపీ వేరయితే తాను ఆ స్థానం భర్తీ చేయాలన్న ఆలోచన కూడా వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నిక వంటి వాటిలో ఏమాత్రం మొహమాటం లేకుండా బీజేపీకి మద్దతిచ్చింది.



ఈ రెండు పార్టీల వైఖరిని మిగిలిన విపక్షాలు తప్పుబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం కోసం టీడీపీ, వైసీపీ ప్రయత్నిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయని సీపీఐ పార్టీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ నేత రామకృష్ణ ఈ రెండు పార్టీలను విమర్శించే ప్రయత్నంలో ఘాటు పదజాలమే వాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కట్టుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తుంటే.. వైఎస్ జగన్ ఉంచుకున్న పెళ్లాంలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

cpi ramakrishna కోసం చిత్ర ఫలితం

జగన్, చంద్రబాబు తమపై ఉన్న కేసుల కోసం నరేంద్రమోడీకి భయపడిపోతున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శిస్తున్నారు. వీరి చేతగాని తనం వల్లే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు కూడా రాకుండా పోతున్నాయని ఆయన మండిపడ్డారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ అంటున్నారు. ఇక చంద్రబాబును నోటుకు ఓటు కేసు భయపెడుతోందని ఆయన విశ్లేషించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: