తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాదిమంది ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, వారి వారసులు ఆయన దర్శకత్వంలో నటించాలని ఎంతో ఉత్సాహం చూపిస్తారు..ఒక్కసారి దర్శకేంద్రుడితో సినిమా తీస్తే మంచి పేరు వస్తుందని నమ్మకం.  అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన హీరోలు, హీరోయిన్లు తర్వాతి కాలంలో నెంబర్ వన్ పొజీషన్లో దుమ్మురేపారు. 
Image result for raghavendra rao
  గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలలోను, సోషల్ మీడియాలోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  దీనిపై స్పందించిన రాఘవేంద్రరావు తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాను అని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని స్పష్టం చేశారు.
Image result for raghavendra rao
ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్న ఈ దర్శకుడు త్వరలోనే టీటీడీ చైర్మన్ కాబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  అందులోనూ రాఘవేంద్ర రావుకి ఏపీ సీఎం మంచి సుపరిచితులు..దాంతో ఆ పదవీ ఆయనే కట్టబెడతారని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

ఇక టీటీడీ చైర్మన్ ను నియమించడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండటంతో.. చైర్మన్ రేసులో రాఘవేంద్రరావు కూడా ఉన్నారని, ఆయనకే ఆ పదవి లభించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అయితే  టీటీడీ బోర్డు మెంబర్ గా, శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా తను శ్రీవారికి సేవ చేసుకుంటున్నాను అదే చాలు..అని రాఘవేంద్రరావు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: