క్లౌడ్ సేవలపై ఏపీ సర్కారు దృష్టి సారిస్తోంది. భవిష్యత్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న ఏపీ సర్కారు అందులో క్లౌడ్ సేవలను కూడా ప్రధానంగా భావిస్తోంది. అందుకే ఈ రంగంలో దిగ్గజాల సహకారం తీసుకోవాలని భావిస్తోంది. ఈ రంగంలో అనుభవం ఉన్న అమెజాన్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

lokesh meet amazon కోసం చిత్ర ఫలితం

ఇందులో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనలో అమెజాన్ సంస్థ ను కలిశారు. అమెజాన్ సంస్థ ఉపాధ్యక్షుడు ఫర్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ మైకేల్ పంక్, డేవిడ్ రాత్ సీనియర్ ప్రొడక్ట్ మ్యానేజర్ తో నారా లోకేశ్ సమావేశమయ్యారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని లోకేశ్ వారికి తెలిపారు. ఏపీలో ఈ ప్రగతి ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా ఒకే వేదిక పైకి తీసుకొచ్చి, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏర్పాటు చేస్తున్న తీరును వారికి వివరించారు. 


క్లౌడ్ సర్వీసెస్, ఐఓటికు పెద్ద ఎత్తున డిమాండ్ పెరగుతున్నందువల్ల ఏపీని క్లౌడ్ హబ్ గా మారుస్తున్నామని నారా లోకేశ్ వారికి వివరించారు. విశాఖపట్నం, అండమాన్, సింగపూర్ ని కలుపుతూ ఇంటర్నెట్ ల్యాండింగ్ పాయింట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నారా లోకేశ్ వారికి తెలిపారు. క్లౌడ్ ఏర్పాటు చేసే ఆలోచన లో తాము ఉన్నామని.. అమెజాన్ క్లౌడ్, అలెక్సాను ప్రభుత్వం వినియోగిస్తోందని సంస్థ ఉపాధ్యక్షుడు లోకేశ్ కు తెలిపారు. 



క్లౌడ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న క్లౌడ్ హబ్ పాలసీ బాగుందని వారు ప్రశంసించారు. భారత్ లో తమ బృందాన్ని ఆంధ్రప్రదేశ్ కు పంపి స్టార్ట్ అప్ కంపెనీలు, విద్యా, ఆరోగ్య రంగాలను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛదంగా క్లౌడ్ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేందుకు భరోసా ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: