ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కు కాలం కలిసి రావడం లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అనేక వరుస వివాదాలు, పార్టీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విపక్ష వైఎస్సార్ సీపీ నేత జగన్ రోజురోజుకూ ప్రభుత్వ వైఫల్యాలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆయ‌న ఏకంగా ఏపీలోని 13 జిల్లాలు క‌వ‌ర్ చేస్తూ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేస్తున్నారు. ఇక అస‌లే క‌ష్టాల్లో ఉన్న ఏపీలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ప్రత్యేక హోదాపై కూడా బీజేపీ దాటవేస్తోంది. 

Image result for andhrapradesh

పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధుల విషయంలో అతీగ‌తీ లేదు. ఇలా ఇంటాబయట ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఏకంగా టీ టీడీపీని టీఆర్ఎస్ కలపాలనీ, అప్పుడే చంద్రబాబు కు గౌరవం లభిస్తుందనీ కలకలం రేపారు. మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం లో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక చంద్రబాబు కూడా టీ టీడీపీ ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ లో పార్టీ బలోపేతానికి ఆయన కనీసం దృష్టి సారించడంలేదనే విమర్శలు సొంత పార్టీ నేతలే చేస్తున్నారు. 

Image result for ysrcp

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. బీజేపీ విత్రపక్షంగా ఉంటూ వస్తున్న టీడీపీపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుపిస్తున్నారు. బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిగా టీడీపీ నేతలు కూడా ప్రత్యారోపణలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. దీంతో బీజేపీతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచే తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా మాట్లాడడంపై కనీసం సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Image result for bjp

ఇక చంద్ర‌బాబు ముందు ఉన్న అతిపెద్ద సవాలు  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాాణం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి కి తగినట్లు రాజధాని నిర్మాణ పనులు లేవని అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజల నుంచి విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అంత సులువేం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: