భారతీయ జైళ్ళు నేరస్తుల పాలిటి స్వర్గధామాలు అయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. పరప్పణ అగ్రహార జైలులో శశికళా వైభవం అనే సినిమా అందరం తిలకించాం. అంతకు మించిన జైలు వైభవజీవితం మరొకటి వెలుగు లొకి వచ్చింది. అదే జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ లోని సెంట్రల్ జైలు గురించి భయంకరమైన నిజాలు వెలుగు లోకి వచ్చాయి.


srinagar central jail కోసం చిత్ర ఫలితం

పేరుమోసిన ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన ఈ జైల్లో వారికి అమోఘమైన రాచమర్యాదలు జరుగుతున్నయని తెలు స్తుందీ అదీ అంతర్జాతీయంగా పేరొందిన ఉగ్ర వాదులకు.లష్కరే తొయిబాకు చెందిన పాక్ ఉగ్రవాది "నవీద్ జాట్" శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి తప్పించు కోవడానికి విఫలయత్నం చేయడంతో వాస్తవాలు బయట పడ్డాయి. అంతర్జాల సౌకర్యం, మొబైల్ ఫొన్ల సరపరా, కోరుకున్న భోజనం, కశ్మీరీ మాంసాహారం ఇలా ప్రతి ఒక్కటీ ఏం కావాలంటే అదే అందుకునే వెసులు బాటు ఉండటం తో , జైలు లోనే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. 

srinagar central jail కోసం చిత్ర ఫలితం

జైల్లో సఖల సౌఖ్యాలు అనుభవిస్తున్న ఉగ్రవాదులు, జైలు బయట జీవితం కంటే బ్రహ్మాండమైన అద్భుతమైన జీవితం అను భవిస్తున్నారు. సంచలనం సృష్టిస్తోన్న ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరుడుగట్టిన ఉగ్రవాది తప్పించు కోవడానికి ప్రయత్నించడంతో జైళ్లో భద్రత ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. జైలు వ్యవహారాల్లో రాజకీయనేతలు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని అధికారవర్గాలు ఆరోపిస్తున్నాయి. మానవ హక్కుల కార్యకర్త హెచ్ఎన్ వాంఖూ హత్య కేసులో యావజ్జీవిత శిక్షను ఎదుర్కొంటున్న ఉగ్రవాది "ఖాసిం ఫక్తు అలియాస్ ఆషిక్ ఫక్తు" ను దేవుడిగా భావించి, అనుచరు లు పెద్ద సంఖ్యలో తరుచూ జైలుకు వచ్చి కలిసి, ఆయనతో తావీజులు కట్టించు కుని వెళ్ళటం రోజువారీ కార్యక్రమమని జైలు అధికారి ఒకరు తెలియజేశారు.

srinagar central jail కోసం చిత్ర ఫలితం


అనేక కేసుల్లో దోషులుగా తేలిన ఉగ్రవాదులు విరివిగా మొబైల్ వాడుతూ, ఇతర జైళ్లలో శిక్ష అను భవిస్తున్న తమవారితోనూ, పాకిస్థాన్ సరిహద్దుల్లోని తమ ఇతర ఉగ్రవాద అనుచరులతో నిరంతరం మాట్లాడుతుంటారని ఆయన తెలిపారు. మరో ఇస్లామిక్ ఉగ్రవాది "మసారత్ ఆలం"తో కలిసి జైలులో "ఆర్కెస్ట్రా ప్రోగ్రాం" కూడా నిర్వహించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నట్లు సాక్షాత్తూ అధికారులే తెలియ జేయడం గమనార్హం.

srinagar central jail  కోసం చిత్ర ఫలితం

గత పదేళ్ల నుంచి జైలులో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తోన్న "మన్సూర్ అహ్మద్" అనే ఉద్యోగి ఉగ్రవాదులతో ప్రతి నిత్యం సంబంధాలను కొనసాగిస్తున్నారని వారు పేర్కొ న్నారు. ఆరోగ్యపరమైన కారణాలను సాకు గా చూపి జైల్లోని ఉగ్రవాదు లను శ్రీనగర్‌లోని వివిధ హాస్పిటల్స్‌కు తరలిస్తుంటాడని అన్నారు. ప్రస్తుతం తప్పించుకోడానికి ప్రయత్నించిన ఉగ్రవాది "నవీద్ జాట్‌" తోపాటు మరో ఐదుగురు ఉగ్రవాదులను వైద్య పరీక్షల కోసం శ్రీనగర్ మెడికల్ హాస్పిటల్‌కు గత మూడేళ్ల నుంచి జైల్లో విధులు నిర్వ హించే డాక్టర్ "జీనాత్ నిజామీ" సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.

srinagar central jail  కోసం చిత్ర ఫలితం

ఇక్కడ ఉగ్రవాదులు అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారని వారు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో 20 మొబైల్ ఫోన్లను, ఉగ్రవాద ప్రేరేపిత సాహిత్యాన్ని స్వాధీనం చేసు కున్నట్టు వారు వివరించారు. మొత్తానికి ఈ జైలు తీవ్రవాదుల స్వర్గధామంగా మారిందని, ప్రభుత్వ పెద్దలు జోక్యం ఎక్కువ కావడంతో తామేమీ చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు వాపోతున్నారు. పదేళ్ల కిందట సీఆర్పీఎఫ్ దళాలు చేపట్టిన సోదాల్లో పెద్ద సంఖ్యలో మొబైల్స్, మాంసం కోసం ఉపయోగించే కత్తులు, కబాబ్లు తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు 

srinagar central jail  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: