తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టారు.  ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ‘జనసేన’ పార్టీ బలోపేతం కోసం పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు ఒకప్పుడు బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీల వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలకు ఉందని అంటున్నారు. 
Related image
తాజాగా జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ లోక్ సత్తా పార్టీ అద్యక్షుడు జే పి నారాయణ ను అయన కార్యాలయం లో కొద్ది సేపటి క్రితం కలిసారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యెక హోదా విషయం మై నారాయణ తో కలిసి చర్చించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి వెళ్ళే ప్రణాళిక ల గురించి చర్చ కు రానున్నాయ్.వీరిద్దరూ కలిసి జెఎసి ఏర్పాటు చేసి ప్రత్యెక హోదా విషయం లో కేంద్రం తో పోరాడనున్నారు.
Image result
ఈ సందర్భంగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ  మాట్లాడుతూ..కాలు మీద కాలేసుకుని జీవించాల్సిన పవన్ కల్యాణ్ కోరి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆయనను చూడటానికి లక్షలాది మంది డబ్బులిచ్చి వస్తారని, కానీ ఆయన మాత్రం ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపనతో సవాళ్లతో కూడిన జీవనంలోకి వస్తున్నారని చెప్పారు. పవన్, తాను ఇద్దరం లోతుగా, మనసు విప్పి మాట్లాడుకున్నామని జేపీ చెప్పారు.

రాజకీయ పార్టీల పేరుతో కావచ్చు, పౌర సమాజం పేరుతో కావచ్చు, పత్రికల పేరుతో కావచ్చు... తమలాంటి అభిప్రాయాలు ఉన్నవారు, అధికారమే పరమావధిగా భావించకుండా ఉండే వ్యక్తులంతా ఒకటై... సమాజం కోసం ఏమేం చేయగలమనే విషయంపై చర్చించుకున్నామని తెలిపారు.కానీ పవన్ తో పాటు ఎన్ని పార్టీ లు నడుస్తాయి అన్నది ముందుముందు తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ త్వరగా జెఎసి ఏర్పాటు చేయాలి అని చుస్తునారు.


మరింత సమాచారం తెలుసుకోండి: