ఆయుర్వేదం భారతీయులు ప్రపంచానికి అందించిన అనేక వరాల్లో ఇదొకటి.. కానీ.. ఈ ఆయుర్వేదం అసలు రూపం ఇప్పుడు అనేక రూపాల్లోకి మారిపోయి కమర్షియల్ అయ్యింది. అసలైన ఆయుర్వేద నిపుణులు కరవై.. ఆ బ్రాండ్ ను వాడుకునేవారు ఎక్కువయ్యారు. ఆయుర్వేదంలో వశీకరణం.. అంటే ఒకరిని తమవైపు మందుతో ఆకర్షించడం ఒక కళగా చెబుతారు. 

సంబంధిత చిత్రం
ఆయుర్వేదంలో అది చిన్న అంశం మాత్రమే.. కానీ అనేక కారణాలవల్ల, ఒకానొక సమయంలో మన సమాజానికి పుంస్త్వానికి, కామానికి సంబంధించిన మందులు తప్ప, మిగిలినవాటిమీద మక్కువ తగ్గిపోయింది. దాంతో ఆయుర్వేద వైద్యులకు వేరే పనే లేకుండా పోయింది. వాళ్ళకీ ఎప్పుడూ అదే చింత అయిపోయింది. ఏ ఏ పదార్థాలు 'కోరిక'ని ఎలా పెంచుతాయో కనుక్కోవటంలో శాస్త్రం మొత్తం మునిగిపోయింది. 

vasikaranam కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థితి చివరికి గాంధీగారి చేత మొట్టికాయలు వేయించుకునేంత దిగజారిపోయింది. గాంధీ గారు ఆయుర్వేద వైద్యుల్ని అవమానకరంగా విమర్శించటమే కాకుండా తాను స్వయంగా నాచురోపతివైపుకు మళ్ళటానికి కూడా ఇదే కారణమైంది. ఆందోళన, అభద్రతభావాలు ఎక్కువవుతున్నకొద్దీ, ఏ కారణంగా ఐతేనేమీ.. సంతోషం తరుగుతున్నకొద్దీ సమాజంలో సారాయి, సెక్సులకు సంబంధించిన ఆలోచనలు, వాదాలు, పనులు, వృత్తులు ఎక్కువ అవుతాయని కనుక్కున్నారు. 

vasikaranam కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం సమాజం ఆ స్థితిలోనే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఫేస్బుక్కుల్లో, ఇతర సామాజిక వర్గాల్లో దీనికి సంబంధించిన రాతలు ఎక్కువయ్యాయి. దర్శకుడు రామ్ గోపాల్ 
వర్మతో మొదలుకొని అందరూ ఫ్రాయిడ్ ని ఉటంకిస్తుంటే రొంత విచారంగా కూడా ఉంటున్నది.  ఐతే.. ఆయుర్వదంలోని వశీకరణానికి అంత ప్రాధాన్యత లేదని.. దాన్ని ఇప్పుడు సరిగ్గా తయారు చేసే నిపుణులే లేరని చెబుతున్నారు. ఇలాంటి మందులు ఉంటాయంటే నమ్మి మోసపోకండి సుమా. 



మరింత సమాచారం తెలుసుకోండి: