ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సంపద విలువ ప్రకటించటం ఆచారం చేశారు. చంద్రబాబు గారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రతియేటా ప్రకటిస్తూనే ఉన్నారు ఇది అందరికి తెలిసిందే.  నాడు ఎప్పుడూ వీరి సంపద విలువ ఇంత అధికంగా ఉన్నట్లు లెదా పెరిగినట్లు  అనిపించలేదు. "అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్-ఏడిఆర్" ప్రకటించిన వివరాలతో జాతీయస్థాయి లో 31మంది ముఖ్యమంత్రుల కంటె మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు "అందరి కన్న అత్యంత సంపద కల ముఖ్యమంత్రి" అనిపించుకున్నారు.


Image result for richest cm of india ADR & lokesh


మనం అందరం అదృష్టవంతులం ఎందుకంటే మన ముఖ్యమంత్రే గదా! "నంబర్ వన్"  అయ్యారు. అయితే ఇంత తక్కువ సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు "ఈ ఫీట్"  ఏలా సాధించారని విని మాత్రం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గత ఏడాది లోకేష్ వెల్లడించిన ప్రకారం, చంద్ర బాబు గారు స్వంత సంపద ₹2.53 కోట్ల రూపాయలు కాగా వారి అప్పులు ₹3.58 కోట్లు.  పోనీ ఆయన శ్రీమతి భువనేశ్వరి గారి స్వంత సంపద ₹ 25.41 కలుపుకున్నా పాతిక కోట్లు రూపాయలు మించి ఆయన కుటుంబ సంపద ఉండే అవకాశం లేదు.


Image result for richest cm of india ADR & lokesh


ఏడేళ్లుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు గారి  కుటుంబం తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నదే.  ఆ సమయంలో ఇతర ముఖ్యమంత్రులు లేదా కేంద్రం లోని వారు ప్రతిపక్షం వారు వారి సంపద వివరాలు ప్రకటించక పోవ టాన్ని తప్పుపట్టే వారు వెటకారం చేసేవారు. గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రిగారి తనయుడు  లోకేష్ వారి తండ్రి గారి కుటుంబం, తమ కుటుంబం ఆస్తుల వివరాలను ఎంతో పారదర్శకంగా వెల్లడించారు  అందులో తమ కుటుంబ సభ్యు లందరికి ఒక్కొక్కరికి ఎంతెంత విలువైన ఆస్తులు ఉన్నాయో విడి విడిగా తెలిపారు. 

Image result for richest cm of india ADR & lokesh



అయితే లోకెష్ ప్రకటించిన గణాంకాలకు ప్రస్తుతం "అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్" సంస్థ వెల్లడించిన వివరాల కు మద్య తేడా  "హస్తి మశాంతకం" అంటే దోమకు ఏనుగుకు ఉన్నంత సైజు లో తేడా! ఈ రెండునెలల్లో ఇంత భారీగా సంపద సృస్టించారే, అద్భుతం అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్తి చూస్తే ఆంధ్ర ప్రదేశ్ కాని అమరావతి గాని అతి వేగంగా అభివృద్ధి చెందగలవనటంలో ఎలాంటి అనుమానం లేదని ఋజువౌతుంది.

Image result for richest cm of india ADR & lokesh

తన శ్రీమతి ఆస్తులు తన ఆస్తులను 700% పైగా  రెండు నెలల్లోనే పెంచ గలిగిన ముఖ్యమంత్రి గారు అమరావతిని కేంద్రం సహకారం లేకుండానే "ఒక కోటి శాతం" ఈ సంవత్సరాంతానికి పెంచగలరనటంలో సందేహం లేదని విఙ్జుల భావన.  


Image result for association for democratic reforms CMs assets

సంపదను సృష్టించగల సత్తా ఉన్న ముఖ్యమంత్రులు


అయితే తాజాగా వెల్లడైన దేశంలోని సీఎంల ఆస్తుల జాబితాలో మాత్రం చంద్రబాబునాయుడుకే అగ్రపీఠం దక్కింది. ఆయన కు ఆయన భార్యకు కలిపి ₹ 177 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఈ సంస్థ నిజాన్నినిగ్గు తేల్చి చెప్పింది.  ఇందుమూలంగా ప్రజల మస్తిష్కం కదా! వెధవది దానికి వచ్చేవే సందేహాలు. అవే కలిగాయి అవేమంటే, "ఏడిఆర్ సంస్థ తప్పుడు గణాంకాలు ఇస్తుందా? లేకపోతే గత డిసెంబరులో లోకేష్ చెప్పిన దానిలో అబద్ధాలున్నాయా?"  లేక నిజాలు దాచారా?  లేదా ఈ రెండు నెలల్లోనే మన "సంపద సృష్టికర్త"  సంపదను రాత్రింబవళ్ళు అంటే ఆయన రోజుకు 18గంటలు పనిచేస్తారు కదా! అందుకే అలా సంపదను సృష్టించేశారేమో అనేది ప్రజల సందేహం.

Image result for association for democratic reforms CMs assets

సంపదను సృష్టించలేని ముఖ్యమంత్రులు


దీనిని తెదేపా ప్రజా ప్రతినిధులు కాని సామాన్య కార్యకర్తలు కాని లేకపోతే ఆర్ధిక గణాంక బ్రహ్మ లోకెష్ నివృత్తి చేయాల్సి ఉంది. లేకపోతే, ప్రతి సంవత్సరం  ఆస్తుల వెల్లడి పేరుతో నారా వారి కుటుంబం, ప్రజలను మాయ చేస్తుందనే అనుకోవాల్సివస్తుంది. ఇందులో ఉన్న "చంద్ర కోట రహస్యం" ప్రజలకు తెలపాలి వారుకూడా అదేమార్గంలో సంపద సృష్టి ప్రారంబిస్తారు కదా!  అసలు నేడు మహా శివరాత్రి ఈరోజు ఏపని ప్రారంభిచినా ఫలితం 1000 రెట్లకు మించి లభిస్తుందట. ఇంకేం ఇక ఆరుకోట్ల ఆంద్రులారా మొదలెట్టండి మరి మీ సంపద సృష్టిని దానికి లోకేష్ గారు దర్శకత్వం వహిస్తే చంద్రబాబుగారు దిశానిర్దేశం చేస్తారు.

Image result for association for democratic reforms CMs assets

Association for Democratic Reforms (ADR)

మరింత సమాచారం తెలుసుకోండి: