ఆంధ్రప్రదేశ్ లో రాజీకీయాలు చాలా హాట్ హాట్ గా మారిపోతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందటూ తెలుగుదేశం ఎంపీలు చేసిన ఆందోళన అనేక ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తోంది. చంద్రబాబు వ్యుహాత్మకంగానే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఎత్తులు వేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే బీజేపీ- టీడీపీ విడాకులు ఖాయంగా కనిపిస్తున్నాయి. 

tdp mps in parliament కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థితుల్లో టీడీపీ పైచేయిగా కనిపిస్తున్న నేపథ్యంలో జగన్ ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో జగన్ పై చేయి సాధించారు. జగన్ ప్రత్యేక హోదాపై చేసిన రాజీనామాల ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైండ్ల బ్లాక్ అయిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 


తెలుగోడి పౌరుషాన్ని కేంద్రం ప్రభుత్వానికి చూపేందుకు రాజీనామా అస్త్రాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రయోగిస్తోందని వారు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 14 రోజులు కావొస్తున్నా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని వారు పశ్నిస్తున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తోందనగా చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులకు ఆశపడి హోదాను చంద్రబాబు వదిలేశారని చెబుతున్నారు. 


ఐతే.. జగన్ ఎత్తుతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కూడా అందుకు దీటుగానే ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ జగన్ రాజీనామా ప్రకటన డ్రామా అని విమర్శలు చేస్తూ వస్తున్న టీడీపీ.. తాము కూడా రాజీనామాలతోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు,సుజన చౌదరి లతో రాజీనామా చేయించే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేంద్రంలోని టిడిపి మంత్రులు రాజీనామా చేస్తే సంచలనమే అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: