ఈ మద్య డబ్బు కోసం చాలా మంది రక రకాల మోసాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు.  చైన్ స్నాచింగ్, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడుతూ ఈజి మనీ సంపాదిస్తున్నారు. దొరికితే..దొంగ లేదంటే దొరలా సొసైటీలో తిరుగుతున్నారు.  ఆ మద్య ఇద్దరు మహిళలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది..అయితే కొంత కాలంగా మహిళలు ప్రేమలో పడటం..పెళ్లి చేసుకోవడం కామన్ అయ్యింది. సాధారణంగా కట్నం కోసం పురుషుడు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం చూస్తుంటాం. 

కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది..ఓ మహిళ కట్నం కోసం ఏకంగా ఇద్దరిని పెళ్లి చేసుకొని మోసం చేసింది.  సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లాలో 2013లో క్రిష్ణా సేన్ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది. తాను మగాడినని చెప్పుకుంటూ పలువురు మహిళలతో చాటింగ్‌లు కూడా చేసింది.  ఇలా 2014లో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ అయిన ఓ మహిళను పెళ్లి చేసుకోవడానికి కాత్‌గోడమ్ ప్రాంతానికి వచ్చింది.

తాను అలీగఢ్‌లో ఉన్న ఓ సీఎఫ్‌ఎల్ బల్బ్ వ్యాపారవేత్త కొడుకునని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన వ్యాపారాభివృద్ది కోసం డబ్బు కావాలని..లేదా విడాకులు ఇస్తానని బెదిరించింది.  ఆ తర్వాత ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టింది. మొత్తానికి ఆమె కుటుంబం నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం కోసమంటూ ఎనిమిదిన్నర లక్షలు వసూలు చేసింది.    ఆ తర్వాత కాలాధుంగికి చెందిన మరో మహిళను కూడా ఇలా ట్రాప్ చేసి 2016 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుంది. ట్విస్ట్ ఏంటంటే..విచిత్రమేమిటంటే క్రిష్ణాసేన తొలి పెళ్లి సమయంలో ఈ రెండో భార్య ఓ అతిథిగా వచ్చింది. 

ఇలా కొంత కాలంగా వారిని మ్యానేజ్ చేస్తూ... హల్‌ద్వానీ ప్రాంతంలోని టికోనియాలో ఓ రూమ్ తీసుకొని ఇద్దరు భార్యలను అక్కడే ఉంచింది.  అయితే క్రిష్ణాసేన మగాడు కాదు మహిళ అని రెండో భార్య తెలుసుకోవడంతో..ఆమె డబ్బు ఇస్తూ మరికొంత కాలం మేనేజ్ చేసింది. ఇంతలో మొదటి భార్య కట్నం వేధింపులు కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీనితో అసలు విషయం బయటకి వచ్చింది.  దీంతో క్రిష్ణ సేన్ అలియాస్ స్వీటీ సేన్‌ను గురువారం అరెస్ట్ చేసినట్లు నైనితాల్ ఎస్పీ జన్మేజయ్ ఖండూరి చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: