ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రంజుగా మారింది. వైఎస్ జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానన్న ప్రకటనతో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రం కోసం తెలుగు దేశం ఎంపీలు.. తాము పార్లమెంటులో పోరాటం చేస్తున్నామని బిల్డప్ ఇచ్చేవారు. అందుకు అనుగుణంగానే మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో వారు రచ్చ రచ్చ చేశారు. 


ఐతే... జగన్ రాజీనామాల ప్రకటనతో ఒక్కసారిగా తెలుగుదేశం డైలమాలో పడిపోయింది. ఇక ఇప్పుడు తాము వైసీపీపై ఎలాంటి విమర్శలు చేసినా జనం పెద్దగా పట్టించుకునే అవకాశం కనిపించడంలేదు. ఈ సమయంలో జగన్ కు షాక్ ఇచ్చేలా టీడీపీ కూడా రాజీనామాల బాట పట్టబోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామాలు చేస్తారు అని గడువు విధించడం టీడీపీకి ప్లస్ పాయింట్ అయ్యింది. 


టీడీపీలోని కేంద్రమంత్రులు ఏప్రిల్ 6 కంటే ముందే రాజీనామా చేస్తారట. ఈ విషయాన్ని మంత్రి ఆదినారాయణ బయట పెట్టారు. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించడానికి ముందే తమ పార్టీ కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయిస్తామంటూ ఆయన మీడియా ముందే చెప్పేశారు. కేంద్రం పరిష్కరించాల్సిన 19 అంశాలూ నెరవేర్చాల్సిందేనని.. పరిష్కారం లభించకుంటే.. మార్చి 5వ5 తేదీనే రాజీనామాలు చేయిస్తామనీ ఆయన కామెంట్ చేశారు. 



అంతే కాదు.. ఇక బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకుంటోందని కూడా ఆది నారాయణరెడ్డి చెప్పేశారు. రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూల్.. జగన్ ది ఏప్రిల్ ఆరు డెడ్ లైన్ అయితే.. మాది మార్చ్ ఐదు డెడ్ లైన్.. మార్చ్ ఐదున పార్లమెంట్లో కేంద్రం ఏపీకి అనుకూలమైన ప్రకటన చేయకపోతే ఆ రోజే మా కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారు..  అదే 
రోజు మేము బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుంటాము.. అని ఆది నారాయణ రెడ్డి తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: