అమెరికా అధ్యక్షుడు ఏరకమైన మెలికలు పెట్టినా సెనేట్ లో మార్పులకు చేర్పులకు గురౌతూనే ఉంది. అదేమరోసారి ఋజువైంది. విదేశీయులకు గ్రీన్ కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనకు యుఎస్ సెనేట్ లో చుక్కెదురైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన "నూతన ఇమ్మిగ్రేషన్ బిల్లు" కు ఎగువసభలో సవరణలను ప్రతిపాదించారు. 
Related image
విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే అత్యంత అనుభవం ఉన్న నిపుణులను - ప్రతిభ ఆధారంగా మాత్రమే అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ కార్డుల జారీ లోనూ దేశాలకు కోటా విధించాలని ప్రతిపాదిస్తూ నూతన ఇమ్మిగ్రేషన్ బిల్లుకు రూపలక్పన చేసింది. అమెరికాకు భారీ ఎత్తున నిపుణులను అందిస్తున్న భారత్, చైనా వంటి దేశాలకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి.
Related image
ఈ బిల్లు బుధవారం అమెరికా ఎగువ సభ ముందు చర్చకు వచ్చింది. చర్చలో భాగంగా సెనేటర్ "ఒర్రిన్ హాచ్" గ్రీన్-కార్డుల జారీలో దేశాల వారీగా కోటా విధించాలన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రతిపాదించారు. ప్రతిభ అధారంగా విదేశీ నిపుణులకు ఉద్యోగఅవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదనకు సమ్మతించారు. ఈ సవరణకు ఆమోదం లభిస్తే అమెరికాలో భారీ ఎత్తున స్థిరపడిన ప్రవాస భారతీయులు, చైనీయులకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతిభగల  విద్యావంతుణ్ణి ఏ చట్టం కూడా నిలువరించలేదన్న భారతీయ ధర్మ సూక్ష్మం మరో సారి పరీక్షకు ఎదురొడ్డి నిలబడింది.  

Image result for us chamber of commerce

Image result for us chamber of commerce
కాగా ఈ బిల్లు ప్రతిపాదన సందర్బంగా సెనెటర్లు స్పందిస్తూ, ఈ బిల్లుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ యుఎస్ కంపెనీ లైన మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, వాణిజ్యరంగ సంస్థలు, "యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్" తో పాటు "ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్" కూడా ఆమోదించాలని కోరుతున్నాయని వారు గుర్తు చేశారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే, ప్రపంచంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. 


ఎక్కడ అయితే అమెరికన్ కార్మికులు తక్కువగా ఉన్నారో అక్కడ పరిశ్రమలకోసం హెచ్1బీ వీసా అందుబాటులోకి ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ లో సంస్కరణలు, మోస పూరిత కుట్రలు తగ్గించి, వర్కర్లను కాపాడుతుందని, ఎక్కువ ప్రతిభా వంతులైన వర్కర్లకు గ్రీన్-కార్డు లభించే సౌలభ్యాన్ని పెంచుతుందని వారు సభలో వివరించారు. గతంలో కూడా కాంగ్రెస్ సెనేటర్లు బిల్లును రెండు సార్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 


అమెరికాకు ప్రతిభావంతుల అవసరం చాలా ఉందని మెరిట్ ప్రాతిపదికన వలసదారులను ఎన్నుకుంటే భవిష్యత్ లో అది తమ దేశాభివృద్ధికి ఎంతో తోడ్పతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు అమెరికాలో కూడా ఉన్నాయని, "హెచ్1బీ వీసాల పరిమితి" పెంపుతో వివిధ రంగాల నిపుణులతో టెక్నికల్ రంగంలో ఖాళీలు భర్తీ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Image result for US information technology Industry council

మరింత సమాచారం తెలుసుకోండి: