"జనసేన పార్టీ క్రమంగా తన ఆకర్షణ కోల్పోతోంది.. పవన్ కల్యాణ్ క్రమంగా తన అన్న చిరంజీవిలా తయారవుతున్నాడు.. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని క్రమంగా ప్రజారాజ్యం పార్టీ కంటే దారుణంగా తయారు చేస్తున్నాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.. పవన్ కల్యాణ కూడా చిరంజీవిలా తయారవుతున్నాడన్న సంగతి జనం త్వరలోనే గుర్తిసారు.."


ఇదీ సంచలన దర్శకుడు తాజాగా పవన్ కల్యాణ్ పై విసిరిన ట్వీటాస్త్రం.. ఇటీవల కొద్దికాలంగా సైలంట్ గా ఉన్న వర్మ మరోసారి పవన్ కల్యాణ్ పై రెచ్చిపోయి ట్వీట్లు చేశారు. జనసేన ప్రజారాజ్యం కంటే వరస్టుగా తయారవుతుందని చెప్పడం ద్వారా మరోసారి తేనెతుట్టెను కదిపాడు. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని హైదరాబాద్ లోని నోవాటెల్ పార్టీలో ప్రకటించిన సమయంలో సింహంలా గర్జించాడని వర్మ తన ట్వీట్ లో గుర్తు చేసుకున్నారు. 



కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తన అన్న చిరంజీవిలా తయారవుతున్నాడని పోలికతో చెప్పారు. ఇప్పటికే పలువర్గాల ప్రజలు పవన్ కల్యాణ్ లో చిరంజీవిని చూసుకుంటున్నారని దెప్పి పొడిచారు. తాజాగా పవన్ కల్యాణ్ లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణను, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని చేరదీసిన తర్వాత పవన్ క్రెడిబిడిలటీ విపరీతంగా పెరిగిందన్న వర్మ..ఇకనైనా జనసేన మొత్తం సీట్లలో పోటీ చేయకపోతే.. చిరంజీవి కంటే పెద్ద తప్పు చేసిన వాడవుతారని పవన్ నుద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: