కొంతమంది సింహాసనానికి బంక అంటించుకుని కూర్చుంటారు. లేచేటప్పుడు తన కొడుకునో? కోడలినో? వారసులుగా పీఠం మీదకు తీసుకురావటం ఆతరవాత మనవణ్ణి కూడా పీఠం మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలే ప్రాధమ్యాలుగా పనిచేస్తున్న నాయకులకు ప్రథమ ఉదాహరణ మన ముఖ్యమంత్రి. నాడు మామ నందమూరిని వెనుక నుండి వేటేసి నేడు ప్రధాని నరెంద్రమోడీని వెన్నుపోటు పొడవటానికి సమాయత్తమౌతున్నఅపరచాణక్యుడని ఒకవర్గం తెలుగు మీడియా చేత కొనియాడబడు తున్న ఒక స్వార్ధపరజీవిని ప్రజలు ఖర్మగాలి తమ భుజస్కందాలపై మోస్తున్నారు.

Image result for backstabbing by chandrababu

తనకు రాజకీయ వారసులెవరూ లేరని చెప్పారు నాడు నందమూరి. అలాంటి నాయకుణ్ని జాతి గౌరవం కోసం అహర్నిశం శ్రమించి తెలుగు జాతి గౌరవం ఎవరెష్ట్ ఎత్తులో నిలబెట్టిన మహనీయుడు నందమూరిని నిట్టనిలువునా కూల్చేసిన వ్యక్తి నేడు తన స్వార్ధం కోసం కేంద్రంతో ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక పాకేజిని అంగీకరించటం స్వార్ధరహితం అనలేము.

Image result for backstabbing by chandrababu

నిలువెల్లా స్వార్ధం నింపుకున్న వారెవరూ చాణక్యుడు కాలేరు. చాణక్యుడు తన జీవిత సర్వస్వం దేశ సమగ్రతకు దేశ సార్వభౌమవ్యాప్తికి నిస్వార్ధంగా సమర్పించాడు. అందుకే ఒక విషయ పరిశీలన చేయవలసిన అవసరముంది.నరెంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటానికి అభ్యంతరం చెప్పటంతో ప్రత్యేక హోదా ఇవ్వటానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన ప్పుడు ఏపి ముఖ్యమంత్రి "ప్రత్యేక పాకేజి"  కావాలని కోరాడని నాటి వార్తలు ఇప్పటికి రికార్డుల్లో ఉన్నాయి. ప్రత్యేక పాకెజీ కోసం అహరాహరం శ్రమించినట్లు నాడు సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు లాంటి తెలుగుదేశం ప్రతినిధులు అనేకులు చెప్పుకున్నారు.

Image result for backstabbing by chandrababu

వీళ్ళని ప్రత్యేక పాకేజి ఎవరు అంగీకరించమని ఎవరన్నారని ఆరు కోట్ల ప్రజలు నేడు ప్రశ్నిస్తున్నారు. తమందరి ఆశలపై తానొక్కడే నిర్ణయం తీసుకేనే అధికారం ముఖ్యమంత్రికి ఎవరి చ్చారని ప్రజలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కేంద్రం విభజన హామీలను అమలు పరచనప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లతో కలసి చర్చించాలని అవసరమైతే రాజీనామా చేసి ప్రజల్లో ఉద్యమం నిర్వహించి ఉండవలసిందని అంటున్నారు. అంతేకాదు తన స్వార్ధం కోసం హైదరాబాద్ పై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకున్న పదేళ్ళ హక్కును వదిలేయటంలో అంతరార్ధమేమిటి? అందుకు ఆ ప్రయోజనాన్ని మోడీ వదిలెయ్యమని అనలేదే? ఆ తప్పు చేయకుంటే కేంద్రానికి ఒకదశబ్ధ సమయం రాజధాని నిర్మాణానికి లభించి ఉండేది. ఈ వెసులు బాటు ఎందుకు వదులుకున్నారని మోడీ అడిగితే ముఖ్యమంత్రి సమాధానమేమిటి?

Image result for backstabbing by chandrababu

ఎవరైనా స్వర్గస్తులైన నాయకుల వారిపేర్లు ప్రభుత్వ పథకాలకు పెడతారు. అదీ ఆయా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకే ఇది వర్తిస్తుంది. కాని ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ముఖ్యమంత్రి పేరుతో చంద్రన్న పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారు.పోలవరంలో అంతులేని అవినీతి స్వయంగా ముఖ్యమంత్రే చేశారని కాంగ్రేస్ సభ్యుడు జయరాం రమేష్ ఎలుగెత్తి చెప్పారు. వెనుకబడ్డ జిల్లాలకిచ్చిన వెయ్యికోట్లను దారి మళ్ళించి వేరే విధంగా వాడేశారని ఘనుడైన మన సిఎం తన నేరాలపై విచారణ మొదలౌతుందన్న భయం పట్టుకొని తన తప్పులని  కప్పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పై నెట్టేస్తున్న క్రమానికి సహకారం అందిస్తు న్నారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్. ఆయనకై ఆయనే చెప్పారు తాను అధికారంలో ఉన్న పార్టీకే సహకరం చేస్తానని. 

Image result for backstabbing by chandrababu 

ఈ విధంగా ముఖ్యమంత్రి తన పాలనాపరమైన చేతకానితనాన్ని ఒక ప్రక్క-ప్రజల నుండి రాబోయ్యే తిరుగుబాటు ను తప్పించుకోవటానికి మిత్రలాభం వదిలేసి మిత్రభేధం చేపట్టి నేడు తన పంచమాంగ దళాలతో..  మీడియా సహకారంతో మరో వెన్ను పోటుకు తెరలేపారని ప్రజలు అనేక మంది విపక్ష ప్రజా ప్రతినిధులు అంటున్నారు. గోదావరి జిల్లాలో అనేక చోట్ల వెల్లడౌతున్న ప్రజాభిప్రాయమిది.

మరింత సమాచారం తెలుసుకోండి: