కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాలు బయట పడ్డాయి. ఆదివారం స్థానికులు చెరువులో తేలుతున్న మృతదేహాలను గుర్తించడంతో విషయం బయట పడింది. పోలీసులకు సమాచారం తెలియజేయడంతో జిల్లా పోలీసు, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మధ్యాహ్నం 12గంటల నుంచి మృతదేహాలను వెలికితీసే చర్యలు ప్రారంభించారు. బోట్లు, ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తెచ్చారు. ప్రాథమిక వివరాల ప్రకారం మృతి చెందిన వారంతా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం అక్రమ రవాణా కూలీలుగా అధికారులు భావిస్తున్నారు.   

కడప ఒఎస్‌డి ఆత్నాన్‌ నయీమ్‌ హసీమ్‌, రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మంల ఆధ్వర్యంలో జిల్లా అగ్నిమాపక సిబ్బంది సహకారంతో చెరువులోని ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఐదుగురి శరీరాలపై షర్టులు నడుంకు టవళ్ళు ఉన్నాయి, అలాగే వెనుకవైపు స్టూడెంట్స్‌ బ్యాగులు తగిలించుకుని ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి దుర్గంధం వెదజల్లడంతోపాటు వారికి సంబందించి ఎటువంటి ఆధారపత్రాలు లభించకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.
Image result for ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల
కొద్దిరోజుల క్రితం లారీని ఒంటిమిట్ట పరిసరాల్లో పోలీసులు అనుమానంతో వెంబడించడం, వెంటనే తేరుకున్న లారీలోని వ్యక్తులు చెరువుకట్టపై ఆపి చెరువులో దూకి పరారైనట్లు సమాచారం.  ఇదిలా ఉంటే.. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.
Image result for ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల
ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి.  అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి. మరోవైపు తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్‌లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: