తెలుగుదేశం పార్టీలో వస్తున్న మార్పులు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికే సిద్దమవుతున్నట్లు కనిపిస్తోందf. ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇతర టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల తీవ్రత ఆ పార్టీ పొత్తును తెంచుకోవడానికే సిద్దమైనట్లు బలంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఇదే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.టీడీపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయడం వెనుక వ్యూహం కూడా అదేనని అంచనావేస్తున్నారు. 

Image result for chandrababu modi

బడ్జెట్‌ రోజు నుంచి చంద్రబాబు వైఖరిలో తీవ్ర మార్పురావడానికి కారణమేంటో అంతుబట్టడంలేదని పేర్కొంటున్నారు.ముఖ్యమంత్రి అడిగినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ప్రధానమంత్రి కార్యాలయం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అధికప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు ఫీలయ్యారా..అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నారా.. అంటే అవుననే అంటున్నారు. టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే చంద్రబాబులో మార్పుకు కారణమట. అయితే.. దీంతో బీజేపీ నేతలు ఏకీభవించడంలేదు. ప్రధానమంత్రిని చాలామంది మంది ఎంపీలు తరచూ కలుస్తుంటారు, అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారుకదా? అని చెబుతున్నారు.

Image result for bjp

వివిధ పక్షాల ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదన్నదానిపై వారి వద్ద సమాధానం లేదు. ఏదేమైనా అపాయిట్‌ మెంట్ రగడే తెగదెంపులకు కారణమని తెలుస్తోంది. టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమైందన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టినట్లు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: