ఈ మద్య కొంత మంది దుర్మార్గులు డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు.  ఎదుటి వారిని బురిడీ కొట్టించి ఈజీగా మనీ సంపాదించాలని ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు. ఇందుకోసం కొంత మంది అమాయకులను అవసరమైతే ప్రాణాలు తీయడానికైనా  తెగిస్తున్నారు.  ఈ మద్య కొంత మంది తనయులు తమ తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు పంపుతున్న విషయం తెలిసిందే.  జీవితం చివరి కాలంలో అటు ఐనవారి ఆదరణ లేక..కృంగిపోతున్న తల్లిదండ్రులు వృద్దాశ్రమంలో అయినా కాస్త రక్షణ ఉంటుందని వెళ్తున్నారు. 
Image result for oldage homes in india
కానీ అక్కడ వృద్దాశ్రమంలో ఆ రక్షణ కూడా లేకుండా పోయింది. తమిళనాడులో ఒక వృద్ధాశ్రమం చేసిన దారుణచర్యలు చూస్తే, పరిస్థితి ఎంత నికృష్టంగా తగలడిందో తెలుస్తోంది. వృద్దాశ్రమం పేరుతో నడుపుతూ, అక్కడ చనిపోయిన వారి శవాలతో దందా చేస్తోంది. స్థానికులు ఆ సంస్థకు సంబంధించిన సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిబ్రవరి 22న తాంబరం సమీపంలో కూరగాయల వ్యాన్ లో ఇద్దరు వృద్ధుల్ని తరలిస్తున్న సమయంలో స్థానికులు పట్టుకున్నారు.

వృద్దాశ్రమంలో మరణించిన విజయకుమార్ తో పాటు మరో ఇద్దరు వృద్ధులను కాయగూరలు వ్యాన్ లో  సిబ్బంది రహస్యంగా తరలిస్తున్న సమయంలో, వృద్ధులు కాపాడమని అరవడంతో పట్టుకున్నారు స్ధానికులు.  కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో విదేశీ నిధులతో ఈ సంస్థ నిర్వహించబడుతోంది. ఆశ్రమంలో తమిళనాడు, ఎపి, పాటు కర్నాటక చెందిన వృద్ధులు,మహిళలు, మతిస్థిమితం లేనివారు మూడువందలమంది ఉన్నారు. స్థాపించి ఏడేళ్లయిందని, ఈ ఏడేళ్లకాలంలో ఎన్నో  దారుణాలకు ఈ సంస్థ పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 

శవాల్ని స్మశానానికి తరలించకుండా, ఆశ్రమం వెనుకగదిలో పెట్టి, ఎముకల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆశ్రమనిర్వాహకులు. పాలేశ్వరం గ్రామస్థులు ఆశ్రయం తక్షణం మూసేయడమే కాక, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: