ఒడిశా తీరంలో బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది.350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలిగే సామర్థ్యం ఈ ధనుష్ క్షిపణి సొంతం. అంతేకాకుండా, నౌకల నుంచి ప్రయోగించే ధనుష్ క్షిపణిని బంగాళాఖాతంలోని యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు.  ఈ ప్రయోగం సఫలమైందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
Image result for balistick danush
ఇటీవలే స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన భారత్ ఈ రోజు మరో పరీక్ష చేసింది. అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యం క‌లిగిన బాలిస్టిక్ క్షిప‌ణి 'ధ‌నుష్'.  500 కిలోల పేలుడు పదార్థాలను తీసుకువెళ్లగల ఈ క్షిపణి సంప్రదాయక ఆయుధాలతో పాటు అణ్వాస్త్రాలను కూడా మోసుకెళుతుంది. 
Image result for balistick danush
కాగా, ఈ ప్రయోగానికి ఆదివారం ఉదయం 11.30 నిమిషాల ప్రాంతంలో ధనుష్‌ను ప్రయోగం నిర్వహించినట్టు చెప్పారు. సముద్ర జలాలతో పాటు తీర ప్రాంతంలో ఉండే లక్ష్యాలను కూడా ఇది చేధిస్తుంది. కాగా, ఈ క్షిపణిని రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేయగా, నేవీ అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: