ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఓ మచ్చగా మిగిలిన కేసు.. నేను నిప్పు అంటూ మాట్లాడే ఆయనకు ఇబ్బందికరంగా మారిన కేసు. ఈ కేసులో నేరుగా చంద్రబాబు వాయిస్ తో సహా దొరికిపోయిన ఉదంతం చిక్కుల్లో పడేసింది. చంద్రబాబు కూడా ఏనాడూ.. నాకు ఈ కేసుతో సంబంధం లేదు.. నేను స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడలేదు అని ఎక్కడా ఇంతవరకూ చెప్పలేదు. 


అసలు నా ఫోన్ ఎలా ట్యాప్ చేస్తారు... అంటూ ఎదురుదాడి చేయడం మినహా.. చంద్రబాబు ఎప్పుడూ ఫోన్ వాయిస్ నాది కాదని ఖండించలేదు. కొన్నాళ్ల క్రితం సంచలనం కలిగించిన ఈ కేసు.. ఆ తర్వాత విచారణ మందకొడిగా సాగుతోంది. మొత్తం మీద చంద్రబాబు, కేసీఆర్ మధ్య అవగాహన కుదరడం వల్లే ఈ కేసు కోల్డ్ స్టోరేజీ చేరిందన్న విశ్లేషణ ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసులో ఓ సంచలన మలుపు తిరిగింది. 


ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న మత్తయ్య ఇప్పుడు అప్రూవర్ గా మారతానంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు.. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ఈయన ఈ కేసులో ఏ4గా ఉన్నాడు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిన ప్రతి సంఘటన తనకు తెలుసంటున్నాడు మత్తయ్య. 

MATTAYYA కోసం చిత్ర ఫలితం
ఈ కేసు విషయంలో హైకోర్టు తన వాదన వినకుండానే ఆదేశాలు ఇచ్చిందని మత్తయ్య అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అంశంలో.. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒకటై తనకు అన్యాయం చేస్తున్నాయని అంటున్నాడు. ఈ ఓటుకు నోటు కేసులో జరిగిన అసలు కథంతా బయటికి రావాలంటే సిబిఐ విచారణ 
జరపాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఈ మలుపు చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందా.. అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: