Image result for amaravati a real estate venture not capital

తెలుగు జాతికి తెలిసిన సత్యం చంద్రబాబు ప్రచార ప్రియుడు అని. ఇందులో రెండో మాటకు తావులేదు. ఉదాహరణకు మరణానంతరం రాజకీయనాయకుల పేర్లు పధకాలకు, నిర్మాణాలకు పెట్టటం సహజం. కాని ఏపి తీరే వేరు. దాదాపు 20 పైగా పధకాలకే ఆయనే తనపేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. 
Image result for amaravati a real estate venture not capital  
అలాగే ఈ ప్రచార సందోహంలోనే ఆర్భాటంగా అట్టహాసంగా తమ విశ్వనగరం "అమరావతి" కి వారు వస్తున్నారు, వీరు వస్తున్నారు అంటూ ఊదరగొట్టి చేసిన ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తన అనుకూల మీడియా తో చేసిన ప్రచారం - ఇప్పుడు ప్రభుత్వమే అబద్ధమని తేల్చిందని అనుకోవాలి. తన అనుకూల మీడియాతో చేసిన ప్రచారం అంతా డొల్ల అని ఈ వార్త చెబుతుంది. 

Image result for amaravati a real estate venture not capital

అమరావతిలో ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించాలని తలపెట్టినట్లు  తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయట. దానికి కారణం ప్రభుత్వమే  ఈ వెంచర్లు వేస్తే సత్వరం అభివృద్ది జరిగే అవకాశం ఉందని తాజా గా భావిస్తున్నారని ఆ ప్రధాన పత్రికలో కథనం. వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించి
వేలంలో విక్రయించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు ఆమోదం తెలిపారు. రాజధాని సంస్థ ద్వారా వీటిని నిర్మించనున్నారు. చదరపు
అడుగుకు మూడువేల రూపాయల లోపు వరకు రేటు ఉండవచ్చని చెబుతున్నారు. 
Image result for amaravati a real estate venture not capital
ఇదంతా చూస్తుంటే అమరావతి భూసేకరణ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారానికేనని తెలుస్తుంది. అలాంటప్పుడు కేంద్రం నుండి రాజధాని కి నిధులు తీసుకొని దారి మళ్ళించే బృహత్ ప్రణాళీక ఉందని అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నట్లు,  నిజంగానే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిందన్న విషయం  దీన్ని బట్టి అర్ధమౌతుందంటున్నారు. ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం లేదని పరోక్షంగా తెలియచేశారన్నమాట.

Image result for amaravati a real estate venture not capital

CAPITAL CRDA PLOTS FOR SALE

రాష్ట్రం, ప్రజల అభివృద్ధి ఉండాల్సిన చోట ప్రభుత్వం, ప్రభుత్వంలోని వ్యక్తులే వ్యాపారాలకు సిద్ధమైతే ప్రజలపై ప్రేమ ఉందని సంక్షేమమే ధ్యేయమనే అధినేత మాటలు నీటి మూటలేనని అర్ధమౌతుంది. ఈ  వైఖరికి జనం చీ కొడుతున్నారు. 
Image result for amaravati a real estate venture not capital 

మరింత సమాచారం తెలుసుకోండి: