ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. ప్రళయాన్ని ప్రమోదాన్ని ముందే పసిగడుతుందట. ప్రకృతి అంటే అడవులు నదీ నదానదాలేకాదు జంతువులు కూడా! కొన్ని పక్షులు, జంతువులు రానున్న ప్రమాదాలని అంటే భూకంపాలకు ప్రళయానికి ముందు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. కాని అవి ఆ విషయాన్ని మాటల రూపంలో ప్రకటించలేవు. అయితే మానవజాతికి సిక్స్త్-సెన్స్ (దివ్యదృష్టి-లేదా షష్టేంద్రియం - పంచేంద్రియాలకు మించిన అవగాహన) ఉంటుందంటారు. అది ప్రకృతి పరమైనది అని కూడా అంటారు. 
 Image result for amitabh's tweet before sridevi's death

Just Before Sridevi's Death Was Announced, Amitabh Bachchan Tweeted This

 tweets posted below:

T 2625 - न जाने क्यूँ , एक अजीब सी घबराहट हो रही है !!


బంధువుల పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లిన దివిజాభినేత్రి శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక అక్కడే కన్నుమూశారు. గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందారు. ఆమె మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందాల నటి శ్రీదేవి మరణ వార్త బయటకు రావడానికి ముందే అద్భుత నటుడు "అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్" ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందీలో ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి ఈ అతిలోక సుందరి మరణాన్ని ఆయన ముందే ఊహించారా? అనే ప్రశ్న ఉత్పన్న అవుతోంది.

Amitabh Bachchan Sridevi

అర్ధరాత్రి దాటాక 1.15 నిమిషాలకు అమితాబ్ "ఎందుకో తెలీదు? నా మనసులో అలజడి చెలరేగుతోందని, ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయి" అని ట్వీట్ చేశారు. అందులో ఆయన మనసు అంతరాంతరాల్లో చేల్రెగిన ఉదృత భావనలు ఇలా మనసు కీడు శంకిస్తోందని అమితాబ్ - బిగ్-బీ ట్వీట్ చేసిన 20 నిమిషాల్లోనే శ్రీదేవి హఠాన్మరణం చెందారు. అయితే రాత్రి 2 గంటల 13 నిమిషాల తరవాతే ఈ వార్త మీడియా ద్వారా బయటకు వచ్చింది. 

Image result for smita patil and amitabh bachchan

బిగ్-బీ ట్వీట్ చూసిన నెటిజన్లు "సిక్స్ సెన్స్, దివ్య దృష్టి, పంచేంద్రియాలకు అందని ఒక దైవిక తలంపు" అంటే ఇదే నేమో అనే అలోచానల ట్వీట్లు చేస్తున్నారు. ఇదే రకమైన లేదా విధమైన దివ్యదృష్టి "కూలీ" సినిమా షూటింగ్‌ లో అమితాబ్ బచ్చన్ గాయపడటానికి ముందే ఆయన సహ నటి స్మితా పాటిల్‌కు కూడా ఇలాగే మనసు కీడు శంకించింది. ఆయనకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో నని వాకబు చేసింది. మరుసటి రోజే అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు.  దీన్నిబట్టి కూడా మనిషిని మనీషిని మించిన మహత్తర శక్తి ఈ ప్రకృతిలో నిబిడీకృతమై సంలీనమై ఉంటుందనవచ్చు కదా!  


మరింత సమాచారం తెలుసుకోండి: