నటి శ్రీదేవి హఠాన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం 54 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణం చెందడం అందరినీ కలచివేస్తోంది. ఇదే సమయంలో ఆమె మరణంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోని అందాల పోటీయే ఆమెను చంపేసిందా.. అసలు ఆ ఇండస్ట్రీ అంటేనే ఓ దుర్మార్గం… ఆడది ఓ సరుకు… అందంగా ఉండాలి… ఆకర్షించాలి… శ్రీదేవి జీవితాన్ని పరిశీలిస్తే నిజంగా జాలేస్తుంది…

sridevi death secret కోసం చిత్ర ఫలితం
శ్రీదేవికి బాల్యం లేదు… శ్రీదేవికి చదువు లేదు… శ్రీదేవికి వేరే లోకమే లేదు… జీవితాంతం కెమెరాలు, లైట్లు, సెట్టింగులు.. ఇవే ఆమె జీవితమంతా … ఇండస్ట్రీలో ఎటు చూసినా అంతా ప్లాస్టిక్ నవ్వులు… హీరోయిన్లపై ఉండే శారీరక మానసిక ఒత్తిడి అనంతం. అందులోనూ టాప్ హీరోయిన్ అయితే అది మరింత ఎక్కువ. వయస్సు పెరుగుతున్నా సరే… బరువు కంట్రోల్‌లో ఉండాలి, మొహంపై ముడతలు, గీతలు ఉండొద్దు… ఆ అందాల తాపత్రయమే శ్రీదేవిని బలిగొందేమో అనిపిస్తోంది.  

sridevi death secret కోసం చిత్ర ఫలితం
అందరికీ తెలుసు… ఆమె ముక్కుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నదని…! అయితే ఆమె ఇప్పటివరకూ చిన్నాచితకా కలిపి 29 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నదట..! సౌత్ కాలిఫోర్నియాలోని ఓ కాస్మెటిక్ క్లినిక్కుకు తరచూ వచ్చేదట… హీరోయిన్ గా ఎదిగే దశలో అంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ ఈమధ్య….54 ఏళ్ల వయస్సొచ్చినా సరే… 

sridevi death secret కోసం చిత్ర ఫలితం

ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లయినా సరే… ఇంకా ఇంకా ఆమె తన ఫిగర్ కాపాడుకోవటానికి ప్రయత్నించిందా.. ఇంకాస్త సౌందర్యానికి పెంచుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రియంచడమే ఆమె ఆరోగ్యాన్ని దెబ్బ తీసిందా..? లెక్కకు మించిన కాస్మెటిక్ సర్జరీను శారీరకంగా, మానసికంగా ఆమెను కుంగదీశాయా.. ఏమో ఆమెను హఠాత్తుగా తీసుకెళ్లిపోయిన ఆ దేవుడికే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: