ఈజిప్టు లో మృతి చెందిన వారికి కొన్ని రసాయనాలు పూసి..ఒక రకమైన బట్టతో చుట్టు చుడతారు..ఆ మృతదేహాలు కొన్ని వందల సంవత్సరాలు కూడా సజీవంగానే ఉంటాయి..ఇది మనకు తెలిసిన విషయమే..అయితే ఇప్పుడు తమ ఆత్మీయులు సుదూర ప్రాంతాల్లో మరణిస్తే..వారి మృతదేహాలు ఏమాత్రం చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ మద్య చూస్తూనే ఉన్నాం.  ఈ ప్రక్రియనే..ఏంటి ఎంబామింగ్‌ అంటారు. ఎంబామింగ్ అంటే ఏమిటి..? ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎంబామింగ్‌ వాడే కెమికల్‌ ఏంటి? ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నాళ్లు బాడీని ఎన్నాళ్లు కాపాడుకోవచ్చు? మరణించిన వ్యక్తి అంతకుముందు మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు తీసిన ఫొటోను ఎంబామింగ్‌ కోసం ఉపయోగిస్తారు. అందంగా లేని వారు అందమైన అలంకరణలు చేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం చేసే పక్రియలనే ఎంబామింగ్ అంటారు.   
Image result for what is embalming
కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని చాలా రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు మృతదేహం కుళ్లిపోకుండా చూడాలి. శరీరం కొంతకాలంపాటు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంబామింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని రసాయనాలను శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ద్రావకాలనే ఎంబామింగ్ ఫ్లూయిడ్స్ అని పిలుస్తారు. ఫార్మాల్డిహైడ్, మెథనాల్, ఇథనాల్‌తోపాటు మరికొన్ని రకాల కెమికల్స్‌ను ఎంబామింగ్‌లో వాడుతారు.  ఈ ప్రక్రియలో  చనిపోయిన వ్యక్తి ఫొటో ఆధారంగా మృతదేహానికి సాధ్యమైనంతగా మునుపటి రూపాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి.
Image result for what is embalming
ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన  ముడతలను తొలగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహానికి సజీవ రూపం వస్తుంది. దీనినే ఫేస్ లిఫ్టింగ్ అని కూడా అంటారు.   అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను కుళ్లిపోకుండా చేయడంలో ముందున్నారు. ఎంబామింగ్ ప్లూయిడ్స్‌ని ఎక్కించడం వల్ల బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అంటే, ఈ ఫ్లూయిడ్ ఏ రకంగానూ బాక్టీరియాకు న్యూట్రియంట్ ఫ్లూయిడ్స్‌గా పనిచేయవు.
Image result for what is embalming
గతంలో శ్రీ సత్యసాయిబాబాకు ఎంబామింగ్‌ చేస్తే ఇప్పుడు అదే ప్రక్రియను శ్రీదేవికి జరిపించారు.అమెరికాలో ఏటా 2 కోట్ల టన్నుల ఎంబామింగ్ కెమికల్స్‌ వినియోగిస్తారని అంచనా.  అమెరికాలో ఇప్పుడు ఎంబామింగ్ పద్ధతిలో ఆత్మీయుల మృతదేహాలను కుళ్లిపోకుండా చేయడంలో ముందున్నారు. ఎంబామింగ్ ప్లూయిడ్స్, కెమికల్స్ అమ్ముడవుతున్నాయంటే, ఈ ప్రకియ అవసరం ఎంతగా గుర్తించారో అర్థం దీన్ని బట్టే అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: