ఇప్పుడు ఏ ఛానల్ ట్యూన్ చేసినా శ్రీదేవి అంత్యక్రియల వార్తలే దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో మరో ప్రముఖుని మరణవార్త బ్రేకింగ్ న్యూస్ గా షాక్ ఇచ్చింది. కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి కన్నుమూశారన్న వార్త భక్తులను కలచివేస్తోంది. ఆయన కంచి కామ కోటి పీఠానికి 69 వ అధిపతి. శ్రీ జయేంద్ర సరస్వతి జూలై 18, 1935న జన్మించారు. 

సంబంధిత చిత్రం
జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. ఈయనకు ముందు సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ కంచి పీఠానికి అధిపతిగా ఉండేవారు. ఆయన్ను  చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి 69 వ పీఠాధిపతిగా నియమించారు. సాధారణంగా కంచి పీఠాధిపతులంటే ప్రవచనాలు, పూజలు, హోమాలే గుర్తుకు వస్తాయి. కానీ ఈ జయేంద్ర సరస్వతి మాత్రం వివాదాస్పదమయ్యారు. 

జయేంద్ర సరస్వతి కోసం చిత్ర ఫలితం
కంచి దేవాలయ మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నిందితుడిగా ఉండటం మరో సంచలనం. ఆయన విచారణకు హాజరు కావడం,  అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ తరవాత కాలంలో ఆయన నిర్దోషిగా ఈ కేసు నుంచి బయటపడ్డారు. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కావాలనే కంచి స్వామిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని కథనాలు వచ్చాయి. 

జయేంద్ర సరస్వతి కోసం చిత్ర ఫలితం
1987 వ సంవత్సరంలో ఆయన కంచి మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యం కావడం కూడా కలకలం సృష్టించింది. కంచి మఠం నియమావళి ప్రకారం పీఠాధిపతి ఎక్కడికి పడితే 
అక్కడికి వెళ్ళడానికి వీలు ఉండదు. కానీ కొన్నిరోజుల తర్వాత ఆయన కర్నాటక కూర్గ్‌లోని తలకావేరి భక్తులకు కనిపించారు. అప్పట్లో అదో పెద్ద మిస్టరీ. ఈయన హయాంలో 
కంచి పీఠం మరింత బలపడిందని చెబుతారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: