ప్రభుత్వ అధికారులు తమ డ్యూటీలు సక్రమంగా చేస్తే..భారత దేశం ఉన్నత స్థానం చేరుకుంటుందని..ఆ మద్య ఓ సినిమాలో హీరో కొట్టిన డైలాగ్ గుర్తుందికదా..అయితే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అక్రమాలతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న వార్తలు రోజూ చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన నిర్వాకానికి నిండు గర్బిణి చనిపోయింది.  వివరాల్లోకి వెళితే..తిరుచ్చి సమీపంలోని తువ్వకూడి లో రాజా-ఉష అనే దంపతులు నిన్న రాత్రి జాతీయ రహదారిలో బైక్ పై ప్రయాణిస్తున్నారు.

తువ్వకూడ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వీరి బండిని ఆపారు. అయితే రాజా హెల్మెట్ ధరించలేదు. దీంతో పోలీసుల్ని తప్పించుకొని ముందుకు వెళ్ళాడు.  విషయాన్నీ గమనించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్వారిని వెంబడించి బండి ఆపాలని రాజాని హెచ్చరించాడు. కానీ రాజా అతని మాటలు వినకుండా కాస్త ముందుకు పోనివ్వడంతో ఆవేశంగా వచ్చిన ట్రాఫిక్ పోలీస్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కాలితో బలంగా తన్నాడు.

దీంతో నిండు గర్భవతి అయినా ఉష రోడ్డుపై పడింది. ఆమె తలకు బలంగా గాయాలవడంతో అక్కడిక్కడే మరణించింది. అయితే పోలీస్ చేసిన ఓవర్ యాక్షన్ కి ఓ నిండు గర్భిణి చనిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్మెట్ పెట్టుకోకుంటే బండి నెంబర్ రాసి ఫైన్ వేస్తే సరిపోతుంది..కానీ ఇలాంటి దారుణానికి పాల్పడి ఓ నిండు గర్భిణి చావుకు కారణం అయిన ఆ పోలీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాదు  రహదారిని స్తంబింపజేసి వాహనాల్ని ధ్వంసం చేశారు. దీంతో పొలిసు ఉన్నతాధికారులు వచ్చి బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: