తమిళనాడులో మరో దారుణం జరిగింది.   పర్వాతారోహణకు వెళ్లిన విద్యార్థుల బృందంలో ఐదుగురు కార్చిచ్చుకు బలయ్యారు. మున్నార్ ప్రాంతంలోని సూర్యనెల్లికి చెందిన 37 మంది విద్యార్థినులు రెండు బృందాలుగా తమిళనాడులోని తేని జిల్లా కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణ కోసం వచ్చారు.  ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు. వారు అడవిలోకి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో విద్యార్థులంతా మంటల్లో చిక్కుకున్నారు.

సమాచారం అందుకునన అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటల నుంచి కొందరు తప్పించుకోగా చిక్కుకు పోయిన ఐదుగురు విద్యార్థినులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 15 మంది విద్యార్థినులను హెలికాప్టర్ల సాయంతో రక్షించినట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరికొందరు గల్లంతయ్యారు.  ఈ ప్రాంతంలో వెలుతురు తక్కువగా ఉండడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడినట్టు మదురై సర్కిల్ కన్జర్వేటర్ ఆర్కే జగేనియా తెలిపారు.
Over 30 Caught In Huge Forest Fire In Tamil Nadu, Air Force Called In - Sakshi
బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. దాదాపు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచారం అందే అవకాశం లేకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Fire Accident
తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిసామి విజ్ఞప్తి మేరకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత వైమానిక దళాన్ని రంగంలోకి దింపారు.  డిప్యూటీ సిఎం ఓ పన్నీర్ సెల్వం కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు ట్రెక్కింగ్ కోసం అటవీ శాఖ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది.

ట్రెక్కింగ్ చేస్తూ విద్యార్థులు పర్వతం మీదికి ఎక్కినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది. 10 -15 మంది విద్యార్థులను రక్షించి గుట్ట పై నుంచి కిందికి తీసుకుని వచ్చినట్లు నిర్మలా సీతారామన్‌కుక జిల్లా కలెక్టర్ తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: