ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి వర్థమాన హీరోయిన్ రాబోతోంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో ఎదుగుతున్న హీరోయిన్, ఈ రోజుల్లో ఫేమ్ రేష్మరాథోడ్  ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రేష్మ రాథోడ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ రోజుల్లో సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పన్నెండు సినిమాల్లో నటించారు. ఇటీవల ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండలంలోని ఇనుపరాతి గుట్టలను ఆమె పరిశీలించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Image result for telangana

ఇదిలా వుండగా... బయ్యారం ప్రాంతంలో అపారమైన ఇనుపరాతి ఖనిజ సంపద ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అప్పటి నుంచి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రేష్మ రాథోడ్ కూడా బయ్యారం ఇనుపరాతి గుట్టలను పరిశీలించడం, ఇక్కడే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరడం.. వచ్చే ఎన్నికల్లో తాను ఏదోఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

Image result for congress

ఇక ఆమె వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారు.. అనే విషయాలపై ఖమ్మం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటే ఎజెండాగా ముందుకు వచ్చే అవకాశం ఉండడంతో ఇల్లందు నియోజకవర్గం నుంచే బరిలో ఉంటారనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఇల్లందు నియోజకవర్గంలో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇల్లందు టాక్ ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ టిక్కెట్ ఆయ‌న‌కే ద‌క్కుతుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హరిప్రియ నియోజకవర్గ పరిధిలో చురుగ్గా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకే టికెట్ వస్తుందని నాయకులు అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కు మళ్లీ టికెట్ ఖాయమని సమాచారం. ఈ నేపథ్యంలో సింగరేణి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన హీరోయిన్ రేష్మరాథోడ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: